బ్రష్ చేసిన.. వెంటనే నోరు కడుక్కుంటే ఇంత ప్రమాదమా ??
ఉదయాన్నే లేవగానే అందరికీ బ్రష్ చేసుకోవటం అలవాటు. బ్రష్‌పైన టూత్ పేస్ట్ వేసుకొని బ్రష్ చేసుకొని క్లీన్ చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల దంతాలు దెబ్బతింటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇదేంటి.. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని నిపుణులే చెప్పారు కదా.. మరిప్పుడు వద్దంటున్నారేంటి అనుకంటున్నారా.. వాళ్లు చెప్పింది బ్రష్ చేయదవద్దని కాదు.. టూత్ పేస్ట్ తో బ్రష్ చేసిన వెంటనే పేస్ట్ ను ఉమ్మివేసి ఆ తర్వాత నోటిని క్లీన్ చేసుకుంటాం.
ఇది సాధారణంగా అందరూ చేసేదే. అయితే, ఇలా చేయడం వల్ల దంతాలను మనమే డ్యామేజ్ చేసుకున్న వారమవుతాం అంటున్నారు. ఎందుకంటే మనం బ్రషింగ్ కోసం పేస్టును వాడేది అందులో ఉండే ఫ్లోరైడ్ కోసం. ఇది పళ్ల మీద ఉండే ఎనామిల్ ను కాపాడుతూ.. కేవిటీలను రాకుండా అడ్డుకుంటుంది. బ్రష్ చేసిన వెంటనే దీనిని దంతాలపై కాసేపు ఉండనివ్వాలని దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నోట్లో ఉండే పేస్టు నురగను బయటకు ఉమ్మివేసిన తర్వాత పళ్లపై పేస్టు పలుచటి పొరలాగా కాసేపు ఉండనివ్వాలి. అప్పుడే అందులో ఉండే ఫ్లోరైడ్ పళ్లకు పట్టుకుని ఉండి ఒక కోటింగ్ ను ఏర్పాటు చేస్తుంది. ఇది మన పళ్లకు రక్షణనిస్తుంది. తర్వాతి కాలంలో పళ్లు వదులవడం, ఇతర దంత సమస్యలు రాకుండా ఉంటాయట. ఫ్లోరైడ్ .. బ్యాక్టీరియా నుంచి పళ్ల ఎనామిల్ ను రక్షిస్తుంది. పళ్లు పసుపురంగులోకి మారకుండా చేస్తుంది. టూత్ పేస్టులో ఉండే మేలు చేసే ఫ్లోరైడ్ స్పటిక రూపంలో మారిపోయి పళ్ల నిర్మాణంలో కలిసిపోతుంది. అప్పుడది ఫ్లోరాపటైట్ అనే ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కాల్షియం, ఫాస్ఫేట్, అయాన్ లను పంటి మీద కోటింగ్ లా ఉంచుతుంది. కానీ, ఇదే ఫ్లోరైడ్ ఎక్కువ మొత్తంలో పళ్లను తాకినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సార్.. నా బాయ్ ఫ్రెండ్ నా నెంబర్ బ్లాక్ చేశాడు.. హెల్ప్ చేయండి.. ప్లీజ్
Sai Pallavi: సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్
Thandel: రూ.100 కోట్లు దాటేసిన తండేల్.. కాలర్ ఎగరేసిన హీరో
‘కో స్టార్‌తో ప్రేమ? ఆ ఒక్క పోస్ట్ తో చిక్కుల్లో హీరోయిన్
థియేటర్లో వెటకారంగా కుర్రాళ్ల డ్యాన్స్.. సాయి పల్లవి ఫ్యాన్స్ సీరియస్