కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..
ఉపాయం లేని వాళ్లని ఊళ్లో నుంచి తరమేయాలి అనేది నానుడి. అవును మరి.. ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుంచైనా బయటపడొచ్చు. అంతేనా ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్టుగా డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు. సరైన సమయంలో సరైన పద్ధతిలో వినియోగించుకుంటే కావలసినంత డబ్బు సంపాదించొచ్చు.. దాంతో కుటుంబాన్ని హ్యాపీగా పోషించుకోవచ్చు.
ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా ఎందరికో ఇలాంటి అవకాశాలు కల్పిస్తోంది. మహాకుంభమేళాకు దేశం నలుమూలలనుంచి జనం కోట్లలో తరలివస్తున్నారు. దాంతో అక్కడ రకరకాల వ్యాపారాలు ఊపందుకున్నాయి. భక్తులకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులను విక్రయిస్తూ ఎందరో జీవనోపాధి పొందుతున్నారు. ఇటీవల ఓ యువకుడు వేపపుల్లలు అమ్మి ఐదు రోజుల వ్యవధిలో రూ.40వేలు సంపాదించాడు. ఇప్పుడు అలాంటిదే మరో వార్త వైరల్ అవుతోంది. ఇతడు మొబైల్స్‌కి ఛార్జింగ్ పెడుతూ గంటకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడనే ప్రచారం జరిగింది. అతనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుంభమేళాకు వచ్చే భక్తుల మొబైల్ ఫోన్లకు చార్జింగ్ సౌకర్యం కల్పిస్తూ గంట సేపు చార్జ్ చేసినందుకు రూ.50 ల చొప్పున వసూలు చేస్తున్నాడని, అలా గంటకు ఒకేసారి 20 మొబైల్స్ కు చార్జింగ్ పెడుతూ గంటకు వెయ్యి రూపాయల చొప్పున సంపాదిస్తున్నాడని ప్రచారం జరిగింది. అతనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను దాదాపు 70 లక్షల మందికి పైగా వీక్షించగా, 6 లక్షలమందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రష్ చేసిన.. వెంటనే నోరు కడుక్కుంటే ఇంత ప్రమాదమా ??
సార్.. నా బాయ్ ఫ్రెండ్ నా నెంబర్ బ్లాక్ చేశాడు.. హెల్ప్ చేయండి.. ప్లీజ్
Sai Pallavi: సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్