సార్.. నా బాయ్ ఫ్రెండ్ నా నెంబర్ బ్లాక్ చేశాడు.. హెల్ప్ చేయండి.. ప్లీజ్
అనంతపురం జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కావడంతో ప్రేమికులు వాలంటైన్స్ డే వేడుకల్లో మునిగిపోయారు. అందరూ గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ సరదా సరదాగా గడుపుతున్నారు. అయితే ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తనతో మాట్లాడటంలేదని, ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని, వెంటనే తన నెంబరును అన్ బ్లాక్ చేయించాలని పోలీసులను కోరింది.
ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా పోలీసులు మాత్రం సీరియస్‌గానే తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ప్రేమికుల రోజున ప్రియుడి ఎడబాటు తట్టుకోలేక డయల్ 100 కు ఫోన్ చేసిన ఓ యువతి, తన బోయ్ ఫ్రెండ్ తనతో మాట్లాడటంలేదని, తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని… అతడికి ఫోన్ చేసి తన ఫోన్ నెంబర్ ను అన్ బ్లాక్ చేయించాలని కోరింది. యువతి ఫిర్యాదును స్వీకరించిన డయల్ 100 కంట్రోల్ రూమ్ నుంచి ఈ ఫిర్యాదును స్థానిక గుత్తి పోలీస్ స్టేషన్ కు పంపించారు. తన బాయ్ ఫ్రెండ్ వేదిస్తున్నాడని, నంబర్ బ్లాక్ చేశాడని ఆ యువతి 100కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చిందని… తగిన చర్యలు తీసుకోవాలని కంట్రోల్ రూమ్ అధికారులు స్థానిక గుత్తి పోలీసులకు సూచించారు. దీంతో గుత్తి పోలీస్ స్టేషన్ బ్లూ కోర్ట్స్ కానిస్టేబుల్ సుధాకర్ ఆ యువతిని సంప్రదించారు. కాల్ లోకేషన్ ఆధారంగా ఆ ప్రాంతానికి వెళ్లి, యువతికి ఫోన్ చేశారు. ఆ యువతి పోలీసులను తన ఇంటి వద్దకు రావొద్దని, తన బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి, తన నంబర్ ను అన్ బ్లాక్ చేయిస్తే చాలని పోలీసులకు చెప్పింది. దీంతో ఆమె నుండి బాయ్ ఫ్రెండ్ నంబర్ తీసుకుని, పోలీసులు అతడికి ఫోన్ చేశారు. బాయ్ ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని స్పందించకపోవడంతో… తిరిగి యువతికి ఫోన్ చేసి… మీ బాయ్ ఫ్రెండ్ నుంచి ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. తరువాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రేమికుల రోజుకు ఒక రోజు ముందు ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటుచేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్
Thandel: రూ.100 కోట్లు దాటేసిన తండేల్.. కాలర్ ఎగరేసిన హీరో
‘కో స్టార్‌తో ప్రేమ? ఆ ఒక్క పోస్ట్ తో చిక్కుల్లో హీరోయిన్
థియేటర్లో వెటకారంగా కుర్రాళ్ల డ్యాన్స్.. సాయి పల్లవి ఫ్యాన్స్ సీరియస్
Samyuktha Menon: నేను ఆల్కహాల్ తాగుతాను.. మోహమాటం లేకుండా స్టేజ్‌పై చెప్పేసిన సంయుక్త