Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్

Sai Pallavi: సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్

Phani CH

|

Updated on: Feb 18, 2025 | 12:27 PM

సాయి పల్లవి! టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండియ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది ఈ హీరోయిన్. తన సింపుల్‌ లుక్స్‌తో.. డౌన్ టూ ఎర్త్‌ బిహేవియర్‌తో.. నాచురల్ యాక్టింగ్ స్కిల్స్‌తో.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో క్రేజీ హీరోయిన్‌గా ట్యాగ్ వచ్చే లా చేసుకుంది,. లేడీ సూపర్ స్టార్ గా నెట్టింట ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది.

అలాంటి ఈ లేడీకి ఓ క్రేజీ అనుభవం ఎదురైంది. తండేల్ ప్రమోషనల్ ఈవెంట్లో ఓ లేడీ ఫ్యాన్ సాయి పల్లవి చేతికి ముద్దు పెట్టడం ఇప్పుడు నెట్టింట వైరల్ టాపిక్ అయిపోయింది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ తండేల్. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిది. కేవలం 10 రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసిన టాలీవుడ్లో వన్‌ ఆఫ్ బిగ్ హిట్ గా రికార్డులకెక్కింది. అయితే తండేల్ ప్రమోషన్లలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు తండేల్‌ జాతర పేరుతో ఓ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్‌లో ఓ మహిళా అభిమాని ఎలాగోలా సాయిపల్లవి దగ్గరకు వచ్చేసింది. హీరోయిన్ తో సెల్ఫీలు దిగింది. ఆ తర్వాత హీరోయిన్ కు‌ షేక్‌హ్యాండ్‌ కూడా ఇచ్చి… సడెన్‌గా ఆమె చేతిని ముద్దాడింది. అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోయింది. అయితే ఫ్యాన్ చేసిన ఈ పనికి సాయి పల్లవి కూడా నవ్వుకుంటూ ఉండిపోగా.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవెంట్ ఎప్పుడో జరిగినా.. ఈ వీడియో మాత్రం ఇప్పుడు బయటికి వచ్చి క్రేజీ క్యాప్షన్స్ అండ్ కామెంట్స్‌ను సొంతం చేసుకుంటోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Thandel: రూ.100 కోట్లు దాటేసిన తండేల్.. కాలర్ ఎగరేసిన హీరో

‘కో స్టార్‌తో ప్రేమ? ఆ ఒక్క పోస్ట్‌ తో చిక్కుల్లో హీరోయిన్

థియేటర్లో వెటకారంగా కుర్రాళ్ల డ్యాన్స్.. సాయి పల్లవి ఫ్యాన్స్‌ సీరియస్

Samyuktha Menon: నేను ఆల్కహాల్ తాగుతాను.. మోహమాటం లేకుండా స్టేజ్‌పై చెప్పేసిన సంయుక్త

TOP 9 ET News: కన్ఫ్యూజన్‌లో రామ్ చరణ్‌, బుచ్చిబాబు | ‘చిరంజీవి తొందర పడాల్సిందే’