AP News: ఓర్నీ పాసుగోల..! గుంటూరులో ఫ్రీ చికెన్ విందు.. ఎగబడిన జనం
గుంటూరు నగరంలోని స్వామి ధియేటర్ ప్రాంగణంలో చికెన్ వంటకాలతో ఉచిత ఆహార పంపిణీ చేశారు. చికెన్ కోడిగ్రుడ్లుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు పౌల్ట్రీ నిర్వాహకులు. దీంతో భారీగా జనం హాజరయ్యారు.ప్రాంగణం నిండిపోవడంతో గేట్లు మూసేశారు నిర్వాహకులు. ఆ వివరాలు ఇలా.
బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపధ్యంలో ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్న వేళ పలువురు అవగాహన కల్పిస్తూ చికెన్, ఎగ్ స్నాక్స్ ఫ్రీగా అందించారు. ఈ మేళాలకు జనాలు ఎగబడటంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంటూరు పట్టాభిపురంలోని స్వామి థియేటర్ గ్రౌండ్‌లో, హైదరాబాద్‌లోని ఉప్పల్ గణేశ్‌నగర్ వద్ద ఫుడ్ మేళాలు నిర్వహించగా జనల తాకిడికి నిర్వాహకులు చేటులెత్తేశారు. గుంటూరులో రద్దీ తట్టుకోలేక గేట్లు మూసేశారు. ఈ అవగాహన సదస్సుకు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
ఇది చదవండి: బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రేలో
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Feb 21, 2025 08:32 PM
వైరల్ వీడియోలు
Latest Videos