కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా?అయితే ఇది మీ కోసమే!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని అందుకు తగ్గట్లుగా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో జరిపిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున.. ఈ కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు.కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్త వారితో పాటు కార్డులు ఉన్నవారు సైతం కొత్తగా సభ్యులను చేర్చేందుకు దరఖాస్తులు చేస్తున్నారు.
ఈ విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 9 ఏళ్ల తర్వాత కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటికే ఉన్న రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం కూడా అవకాశం కల్పించింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఇందు కోసం ఈ సేవా కేంద్రాల్లో అప్లికేషన్లు పెట్టుకోవాల్సిందిగా సూచించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల కోసం లక్షలాది ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఇప్పటికైనా రేషన్ కార్డులు జారీ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులపై అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరిన్ని వీడియోల కోసం
దెయ్యాలు రాత్రికి రాత్రే కట్టిన ఈ మిస్టరీ శివాలయం గురించి మీకు తెలుసా..?
ఇది సింహ గర్జన కాదు.. మొసళ్ల గర్జన.. వీడియో
స్కూటర్‌పై మళ్లీ పాలు అమ్మిన మల్లారెడ్డి..సోషల్ మీడియాలో వైరల్
చూసి రెండేళ్లయింది.. మాట్లాడి ఏడాదైంది: కుమారుడిని తలుచుకుని ధావన్ కన్నీరు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
