Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దెయ్యాలు రాత్రికి రాత్రే కట్టిన ఈ మిస్టరీ శివాలయం గురించి మీకు తెలుసా..?

దెయ్యాలు రాత్రికి రాత్రే కట్టిన ఈ మిస్టరీ శివాలయం గురించి మీకు తెలుసా..?

Samatha J

|

Updated on: Feb 21, 2025 | 2:53 PM

భారతదేశం ఎన్నో పురాతన శివాలయాలకు నిలయం. దెయ్యాలు రాత్రికి రాత్రే కట్టిన శివాలయం గురించి మీకు తెలుసా..? ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే దీనిని దెయ్యాలు రాత్రికి రాత్రే నిర్మించాయని అక్కడి స్థానికులు నమ్ముతారు. ఎంతో బరువున్న రాళ్లను పేర్చిన తీరు, సంక్లిష్టమైన డిజైన్, మానవ మాత్రులకు సాధ్యం కాదన్న వాదన ప్రచారంలో ఉంది. దేవాలయాన్ని పూర్తి చేయకుండా దెయ్యాలు అసంపూర్తిగా ఎందుకు వదిలేశాయన్న అంశం చుట్టూ అల్లుకున్న కథలు శతాబ్దాలుగా సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈ దేవాలయం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

 మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖజురాహో సమీపంలో ఉన్న కకాన్‌మఠ్ దేవాలయం అతి పురాతన భారతీయ శిల్ప కళా నైపుణ్యానికి అద్భుత నిదర్శనం. కొన్ని వందల ఏళ్లుగా స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ, పురాణాల్లో ప్రస్తావించినట్లుగా కకాన్‌మఠ్ దేవాలయాన్ని అతీంద్రియ శక్తులు ముఖ్యంగా దెయ్యాలు ఒక్క రాత్రిలోనే నిర్మించాయట. దెయ్యాలు ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద గ్రానైట్‌ రాళ్లను తెచ్చి వాటిని ఒకదానిపై ఒకటి పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించాయని చెబుతారు. ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా సగంలోనే వదిలివెళ్లాయని అంటారు. ఇందుకు కారణం కూడా చాలా ఆసక్తిగా ఉంది. దెయ్యాలు తమ పనిలో బిజీగా ఉండగా వాటిని ఓ బాలుడు తొంగి చూసాడని అంటారు. తమ రహస్యం బయటపడటంతో శాప ఫలితంగా దెయ్యాలు మాయమైనట్లు చెబుతారు. ఈ కథ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇది ఆలయం గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతోంది. ఈ కథ విన్నవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.సాధారణంగా పురాతన దేవాలయాల నిర్మాణంలో సున్నం లేదా ఇతర బంధన పదార్థాలను ఉపయోగిస్తారు. కానీ కకాన్‌మఠ్ దేవాలయం విషయంలో అలా జరగలేదు. ఇక్కడ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి, ఎటువంటి సిమెంట్ లాంటి పదార్థం ఉపయోగించకుండానే నిర్మించారు. ఈ రాళ్ల పేర్పు ఎంత ఖచ్చితంగా ఉందంటే భూకంపాలను తట్టుకుని నిలబడి నేటికీ ఆ రాళ్లు కదలకుండా ఒకదానిపై ఒకటి నిలబడి ఉన్నాయి. ఈ నిర్మాణం వెనుకున్న రహస్యం ఎవరికీ తెలియదు. ఇది ఇంజనీరింగ్ లకు కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కకాన్‌మఠ్ దేవాలయం నేటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.