ఒక్క హగ్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. కేవలం 20 సెకన్లలో
ఓ సినిమాలో హీరో బాధల్లో ఉన్నవారిని హగ్ చేసుకొని జంతర్‌మంతర్ ఛూమంతర్‌కాళీ...అంటూ కామెడీగా చెప్తాడు. ఆ హీరో కామెడీగా చెప్పినా అందులో నిజం లేకపోలేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఆత్మీయులకు ప్రేమతో ఆలింగనం చేసుకోవడం ద్వారా మనసుకు, శరీరానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. 20 సెకన్లలోనే వారిలో ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని పరిశోధనల్లో తేలింది.
ఈ రోజుల్లో పని ఒత్తిడి, భయాందోళనలు, మనసుకు శాంతి లేకపోవడం సాధారణమైపోయింది. కానీ కేవలం 20 సెకన్ల పాటు హగ్‌చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనివల్ల శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలై, మనసుకు ప్రశాంతతను అందిస్తుందంటున్నారు. భాగస్వామిని లేదా ఇష్టమైన వ్యక్తిని ప్రేమగా హగ్ చేసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందట. ఇది నమ్మకాన్ని పెంచడమే కాకుండా గుండెకు కూడా ఎంతో మేలు చేస్తుందట. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం హగ్ చేసుకోవడంవల్ల మనసు ప్రశాంతంగా మారి ఆనందాన్ని పెంచే హార్మోన్లు విడుదలవుతాయట. ఇది భావోద్వేగాలకే కాదు శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో నొప్పిని తగ్గించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. కొన్ని రకాల చికిత్సల కన్నా ఇది ఎంతో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింహాలకు చుక్కలు చూపించిన జిరాఫీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
5 కేజీల బంగారం నగలు బ్యాగులో పెట్టుకుని స్కూటీపై బయలుదేరాడు.. కొంత దూరం వెళ్లాక
పెన్సిల్ కూడా ఎత్తలేం.. భూమిపైకి వచ్చాక గ్రావిటీయే పెద్ద సవాల్

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో
