రోజూ 5 నిమిషాలు చేస్తే.. అద్భుతాలు మీ సొంతం
శ్వాస వ్యాయామాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. మెదడులోని కేంద్రం మన శ్వాసను నియంత్రిస్తుంది. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు జరిగే.. "ఫైట్-ఆర్-ఫ్లైట్ స్పందన" మనం శ్వాసం తీసుకునే విధానంలో మార్పులకు కారణం అవుతుంది. అదృష్టవశాత్తూ, మనం శ్వాసించే విధానాన్ని మార్చే సామర్థ్యం మనకుంది.
ధ్యానం, యోగా, తాయ్ చి.. సాధన చేసేవారు అనేక రకాలుగా.. శ్వాసను నియంత్రిస్తూ ఉంటారు. ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికీ శ్వాస వ్యాయమాలు హెల్ప్ చేస్తాయి. డీప్ బ్రీత్ ఎక్స్‌ర్‌సైజ్‌లు నాడీ వ్యవస్థను చురుగ్గా చేస్తాయి. ఇవి ఒత్తిడి నుంచి మనల్ని బయటపడేసి శరీరం, మనస్సును శాంతపరచడానికి సహాయపడతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, శరీరానికంతటికీ ఆక్సిజన్ సక్రమంగా అందేలా చేస్తాయి. రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి, హృదయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శ్వాసవ్యాయామాలు.. మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రోత్సహించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. ఫోకస్‌ను ఏకాగ్రతను పెంచుతాయి. శరీరంలో వాపును తగ్గించి తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. శ్వాస వ్యాయామాలు జీర్ణక్రియలో పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. ఇది మెరుగైన గట్ ఆరోగ్యానికి సాయపడుతుంది. దీర్ఘకాలిక నొప్పి, కండరాల బలహీనతతో బాధపడేవారికి శ్వాసవ్యాయామాలు సహాయపడతాయి. అంతేకాదు నిద్రపట్టని వారు నిద్రలో నాణ్యతను గమనిస్తారు. నిపుణుల సూచనల ప్రకారం మేం ఈ వివరాలను మీకు అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bird flu: బర్డ్‌ఫ్లూ టెర్రర్.. చికెన్, గుడ్లు తినొచ్చా? వైరస్ వర్రీ ఎప్పటి వరకు?
NTR ఫ్యాన్స్ ఎఫెక్ట్.. జల్లికట్టులో మనోడే హైలెట్!

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
