Bird flu: బర్డ్‌ఫ్లూ టెర్రర్.. చికెన్, గుడ్లు తినొచ్చా? వైరస్ వర్రీ ఎప్పటి వరకు?
తెలుగు స్టేట్స్‌లో బర్డ్‌ఫ్లూ టెర్రర్ మొదలైంది. లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో అలర్ట్ సైరన్ మోగించాయి ప్రభుత్వాలు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులతో నిఘా ఏర్పాటు చేశారు. వాహనాలు.. సరిహద్దులు దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలోని గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఏపీలోకి ప్రవేశించే కోళ్ల వాహనాలపై నిఘాను కొనసాగిస్తున్నారు.
జగ్గయ్యపేట ప్రాంతంలో 15 చెక్‌పోస్టుల దగ్గర ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ వాహనాల తెలంగాణలోకి.. తెలంగాణ వాహనాలు ఏపీలోకి ప్రవేశించకుండా రెండు రాష్ట్రాల అధికారులు ఎక్కడిక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 24 గంటలూ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్ళకు వ్యాపించిన బర్డ్ ఫ్లూను కట్టడి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. గిరిజన గురుకులాల మెనూలో చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గురుకులాలు, EMRS స్కూళ్ల మెనూలో చికెన్ కు చెక్ పెట్టారు. చికెన్ స్థానంలో ఏదైనా శాకాహారం కూర, పండ్లు, స్వీట్లు అందించాలని సూచించారు. కర్నూలు జిల్లా నర్సింగరావుపేటలో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో.. పౌల్ట్రీ యజమానులను అప్రమత్తం చేశారు అధికారులు. పౌల్ట్రీ నుంచి కిలోమీటర్ దూరం వరకు రెడ్‌జోన్‌గా ప్రకటించిన అధికారులు.. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెడ్‌జోన్ పరిధిలో కోళ్లు, గుడ్ల అమ్మకాలపై నిషేధం విధించారు. చుట్టూ 10 కి.మీ. వరకు సర్వే చేయాలని నిర్ణయించారు. పలు చికెన్ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేశారు. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు గుడ్లు, చికెన్ సరఫరాపై నిషేధం విధించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTR ఫ్యాన్స్ ఎఫెక్ట్.. జల్లికట్టులో మనోడే హైలెట్!

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
