చైనాలో భారీ బంగారు గని విలువ ఎన్ని రూ.లక్షల కోట్లంటే
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో భారీ బంగారు గని బయటపడింది. దాదాపు 78 బిలియన్ యూరోలు విలువైన ఒక ముఖ్యమైన బంగారు గనిని గుర్తించారు. ఈ గనిలో సుమారు 1,000 టన్నుల బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజంగా ఇక్కడ అంచనాలకు అనుగుణంగా బంగారం లభిస్తే చైనా బంగారు పరిశ్రమతో ప్రపంచ మైనింగ్ రంగం ఓ మైలు రాయిగా మారుతుంది.
చైనాలోని వాంగులో బయటపడిన ఈ బంగారు గని ఆ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు. హునాన్ ప్రావిన్స్ జియోలాజికల్ బ్యూరో వాంగు బంగారు క్షేత్రంలో 40 కి పైగా గోల్డ్ వెయిన్స్‌ను గుర్తించింది. ఇవి భూ ఉపరితలం కింద దాదాపు 2,000 మీటర్ల లోతులో ఉన్నాయి. ఈ లోతులో దాదాపు 300 మెట్రిక్ టన్నుల బంగారం ఉంటుందని అంచన వేస్తున్నారు. అయితే, 3,000 మీటర్లకు చేరుకునే వరకు తవ్వకాలు జరపడం వల్ల అదనపు ఆశాజనకమైన నిల్వలు బయటపడ్డాయి. అందువల్ల మొత్తం నిల్వలు 1,000 మెట్రిక్ టన్నులను మించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి నిల్వ భౌగోళిక అన్వేషణలో అసాధారణ సంఘటన అని నిపుణులు పేర్కొన్నారు. కొన్ని నమూనాల్లో మెట్రిక్ టన్ను ధాతువుకు 138 గ్రాముల వరకు బంగారం ఉంటుంది. ఈ స్థాయి నిల్వ సాధ్యమైతే హునాన్ ప్రావిన్స్ ప్రపంచ బంగారు మార్కెట్లో ప్రధాన పాత్రధారిగా ఎదగవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజూ 5 నిమిషాలు చేస్తే.. అద్భుతాలు మీ సొంతం
Bird flu: బర్డ్‌ఫ్లూ టెర్రర్.. చికెన్, గుడ్లు తినొచ్చా? వైరస్ వర్రీ ఎప్పటి వరకు?
NTR ఫ్యాన్స్ ఎఫెక్ట్.. జల్లికట్టులో మనోడే హైలెట్!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

