పెన్సిల్ కూడా ఎత్తలేం.. భూమిపైకి వచ్చాక గ్రావిటీయే పెద్ద సవాల్
2024 జూన్5న ఎనిమిది రోజుల మిషన్ కోసం ఐఎస్‌ఎస్ వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్... బోయింగ్ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యల వల్ల అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. పలుసార్లు భూమిమీదకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. వాస్తవానికి జూన్ 14వ తేదీనే వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురై వారు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
వ్యోమగాములను మార్చి 19న తిరిగి భూమిపైకి తీసుకురానున్నట్లు నాసా ఇటీవల ప్రకటించింది. ఎనమిది నెలలుగా అంతరిక్షంలోనే గడిపిన వ్యోమగాములు తిరిగి భూమిపైకి వచ్చే వేళ వేళ కొత్త సవాళ్లు వెలుగులోకి వచ్చాయి. వారు భూమికి తిరిగొచ్చాక గురుత్వాకర్షణ శక్తితో పోరాడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూ వాతావరణానికి అలవాటు పడేందుకు పలు కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యోమగాములు విల్మోర్, సునీతా విలియమ్స్ ఇటీవల తెలిపారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వ్యోమగాములిద్దరినీ అంతరిక్షం నుంచి ఇంటర్వ్యూ చేసింది. నెలలకు పైగా మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో బరువు లేని స్థితిలో గడిపామని, భూమికి తిరిగొచ్చాక తమ శరీరం పలు శారీరక మార్పులకు గురవుతుందని వ్యోమగాములు ఆ మీడియా సంస్థకు తెలిపారు. గురుత్వాకర్షణ శక్తి ఎంతో కఠినమైనది. తాము భూమిపైకి తిరిగొచ్చాక దాన్నే ఎదుర్కోవాల్సి ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ శక్తి అన్నింటిని కిందికి లాగుతుంది. శరీరంలో ఉండే ద్రవాలు కిందికి వచ్చేస్తాయి. ఆ పరిస్థితుల్లో పెన్సిల్ ఎత్తడం కూడా వ్యాయామంతో సమానం అని విల్మోర్ తెలిపారు. గ్రావిటీ కారణంగా శరీరంలో మార్పులు చెందుతాయి. ఆ సమయంలో అసౌకర్యంగా, భారంగా ఉంటుందని సునీత విలియమ్స్ వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనాలో భారీ బంగారు గని విలువ ఎన్ని రూ.లక్షల కోట్లంటే
రోజూ 5 నిమిషాలు చేస్తే.. అద్భుతాలు మీ సొంతం
Bird flu: బర్డ్‌ఫ్లూ టెర్రర్.. చికెన్, గుడ్లు తినొచ్చా? వైరస్ వర్రీ ఎప్పటి వరకు?
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

