ఐదుసార్లు ఎమ్మెల్యే.. సాధారణ జీవితం.. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు అవమానం..!
ఎర్రటి ఎండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య పడిగాపులు కాశారు. ప్రజా సమస్యలు చెబుతామని 4 సార్లు దీనంగా నిలబడ్డారు. అయినా సీఎం కాన్వాయ్ చూసినట్లుగా ముందుకు వెళ్లిపోయింది. కలుసుకునేందుకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుమ్మడి నర్సయ్య.. ఈ పేరు వినగానే సాధారణ జీవితం.. సాదాసీదాగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఉండే నేత. బస్సులు, ఆటోలో సామాన్య వ్యక్తిలా ఎక్కడికైనా వెళుతుంటారు. అవసరమైతే రోడ్డుపై నడుస్తూ వెళతారు. కాన్వాయ్‌లు, గన్‌మెన్స్, అనుచరులు హడావుడి ఇలా ఏమి ఉండదు. ఇల్లందు నుంచి ఐదుసార్లు సిపిఐ(ఎమ్ఎల్) తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినా సామాన్య వ్యక్తిలా ఉంటారు. అలాంటి నేతకు అవమానం జరిగిందా..?
ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుద్దామని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. అటువంటి నేతకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా గేట్ దగ్గర అడ్డుకుంటారా.. అని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇవ్వక పోవడంపై మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు అఖిల పక్షం తో వెళితే కలవలేదని, ఇటీవల సీఎం ఇంటికి కలుద్దామని ఒక్కడినే వెళ్లినా.. అనుమతి లేదని, గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, సాగునీటి సమస్యలు చెప్పుకుందామని వెళ్ళానని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తెలిపారు. ప్రజల సమస్యలనే మేము ప్రభుత్వాలు, సీఎం దృష్టికి తీసుకు వెళతామన్నారు. వ్యక్తిగత సమస్యలు ఏముంటాయన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ ను కలిసే అవకాశం ఇవ్వలేదు. గత మంత్రులకు అనేక సమస్యలపై చెప్పి విసుగు వచ్చింది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపులో మేము కూడా కృషి చేశామని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు కోసం వెళ్ళే మమ్మల్ని ఈ విధంగా అడ్డుకుని అవమానించడం సరికాదన్నారు గుమ్మడి నర్సయ్య.
ఎర్రటి ఎండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య పడిగాపులు కాశారు. ప్రజా సమస్యలు చెబుతామని 4 సార్లు దీనంగా నిలబడ్డారు. అయినా సీఎం కాన్వాయ్ చూసినట్లుగా ముందుకు వెళ్లిపోయింది. కలుసుకునేందుకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో చూడండి…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
