ఇది సింహ గర్జన కాదు.. మొసళ్ల గర్జన.. వీడియో
సింహాలు గర్జించడం తెలుసు.. కానీ మొసళ్లు గర్జించడమేంటి..? అవసలు సౌండే చేయవు కదా అనుకుంటున్నారా? కానీ మొసళ్లు కూడా గర్జిస్తాయని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. మొసళ్ల గర్జనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మొసళ్లు చూసేందుకు ఎంత భయంకరంగా ఉంటాయో.. వాటి వేట కూడా అంతే భయంకరంగా ఉంటుంది. నీటిలోకి వచ్చిన ఎలాంటి జంతువునైనా ఇట్టే పట్టేసుకుంటాయి. కొన్నిసార్లు ఇలాంటి మొసళ్లు సైతం విచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలోని ఘటన ఓర్లాండోలోని ఓ రిజర్వాయర్ వద్ద జరిగినట్టు తెలుస్తోంది.
పెద్ద పెద్ద మొసళ్లన్నీ కలిసి ఒకటోట చేరాయి. అవన్నీ తలలను నీటిలోనుంచి పైకి పెట్టి విచిత్రంగా అరవడం మొదలుపెట్టాయి. ఒకదాని తర్వాత మరొకటి వింత వింత శబ్ధాలు చేస్తూ అరిచాయి. అవి వినడానికి సింహాలు గర్జిస్తున్నట్టుగా ఉన్నాయి. మొసళ్లు ఇలా విచిత్రంగా గర్జించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా మొసళ్లు సైలెంట్‌గా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఇలా విచిత్రంగా శబ్దాలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొసళ్లు ఇలా గర్జించడం ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఈ శబ్ధాలు వింటుంటేనే భయంగా ఉంది బాబోయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
