Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెపోటుకు నెల రోజుల ముందే... మీ కళ్లలో కనిపించే లక్షణాలు ఇవే!

గుండెపోటుకు నెల రోజుల ముందే… మీ కళ్లలో కనిపించే లక్షణాలు ఇవే!

Samatha J

|

Updated on: Feb 21, 2025 | 2:37 PM

మారిన జీవన శైలి, ఊబకాయం, షుగర్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటివి గుండెపోటుకు దారితీస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి మన శరీరంలో కొన్ని రోజుల ముందునుంచే పలు సమస్యలు మొదలవుతాయి. వాటికి సంబంధించి కొన్ని రకాల లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సార్లు రోజులే కాదు నెలల ముందు నుంచే గుండెపోటుకు సంబంధించి లక్షణాలు కనిపించడం మొదలవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా కళ్లలో కనిపించే మార్పులపై పలు సూచనలు చేస్తున్నారు.

వీటిని గుర్తించి జాగ్రత్తపడటం ద్వారా గుండెపోటు ముప్పును తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. కనుగుడ్లు పసుపు లేదా లేత నారింజ రంగులోకి మారినట్టయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి బాగా పెరిగిపోయిందని అర్థమని నిపుణులు చెబుతున్నారు. రక్త నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ అడ్డుపడుతుండటం కూడా దీనికి కారణమంటున్నారు. ఇది త్వరలోనే గుండెపోటుకు దారి తీసే అవకాశం ఎక్కువ అంటున్నారు. కళ్లలో రక్త నాళాలు ఎరుపెక్కి కనిపించడం శరీరంలో రక్తపోటు తీవ్ర స్థాయికి చేరిందనే దానికి సూచన అని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో తీవ్ర అలసట, నీరసం వంటివి కూడా ఉంటాయని వివరిస్తున్నారు. ఇవి గుండెపోటుకు ముందస్తు లక్షణాలు అని సూచిస్తున్నారు. తరచూ కళ్ల చుట్టూ వాపు రావడం, కళ్లు ఉబ్బిపోయి ఉండటం వంటివి శరీరంలో ద్రవాల సమతుల్యత దెబ్బతిన్నదానికి సంకేతం అంటున్నారు. ఇది కూడా గుండెపోటుకు దారితీసే సూచన అంటున్నారు. కారణం లేకుండా కళ్ల లోపలి భాగంలో తరచూ నొప్పి రావడం కూడా గుండెపోటుకు ముందస్తు సూచిక అని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్త నాళాల్లో రక్తం సరఫరా తగిన స్థాయిలో జరగకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. తరచూ తీవ్రమైన తలనొప్పి రావడం గుండె, రక్త సరఫరా వ్యవస్థలకు సంబంధించిన సమస్య అయి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో కంటి చూపు కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు.