Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గ్రామానికి ఏమైంది?కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం వీడియో

ఆ గ్రామానికి ఏమైంది?కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం వీడియో

Samatha J

|

Updated on: Feb 22, 2025 | 2:24 PM

ఓ స్త్రీ రేపు రా.. ఇది జనానికి బాగా తెలిసిన మాట. గతంలో వీధుల్లో ఆడ దెయ్యాలు తిరుగుతున్నాయంటూ గోడలు, తలుపుల మీద ఓ స్త్రీ రేపు రా అని బొగ్గుతో రాసేవారు. కానీ, ఓ ఆత్మా రేపు రా అంటున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీ వాసులు. అంతుచిక్కని మంటలు అక్కడి జనానికి ఊపిరి ఆడనివ్వడం లేదు. ఇదంతా ఓ ఆత్మ చేస్తున్న పనేనని భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడి ప్రజలు, గత కొద్ది రోజులుగా కంటిమీద కునుకు లేకుండా జాగారం చేస్తున్నారు. ఎవరు కూడా పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంతవాసులు. ఎందుకు జరుగుతుందో అసలే తెలియదు, కానీ గత కొద్ది రోజులుగా గుడిసెలకు మంటలు అంటుకోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు ఆ కాలనీవాసులు

. ఇంట్లోని సామాన్లు, ఇంటి పైకప్పు కవర్లకు మంటలు అంటుకొని కాళీ బూడిదవుతున్నాయి. ఎప్పుడు ఏ వైపు నుండి మంటలు వ్యాపిస్తాయోనని కాపలాకాస్తున్నారు ఆ కాలనీవాసులు. గత రెండు నెలల క్రితం ఇదే కాలనీలో మంటలు వ్యాపించాయి, అయితే అప్పుడు భూత వైద్యులను ఆశ్రయించి, అ ప్రాంతంలో గట్టు మైసమ్మను ఏర్పాటు చేసుకుంటే నిప్పుల వర్షం తగ్గుతుందని తెలపడంతో ఆ కాలనీలో ఆ దేవతను ప్రతిష్టించారు. తిరిగి రెండు నెలల తర్వాత మళ్లీ నిప్పుల వర్షం కురవడంతో ఆ కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు, ఆ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇదంతా ఓ ఆత్మ చేస్తున్న పనని ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిప్పుల వర్షం కురవడంతో ఏం చేయాలో అర్థం కాక పనులకు కూడా వెళ్లకుండా ఇండ్ల చుట్టూ కాపలా కాస్తున్నారు ఆ కాలనీవాసులు.

మరిన్ని వీడియోల కోసం

దెయ్యాలు రాత్రికి రాత్రే కట్టిన ఈ మిస్టరీ శివాలయం గురించి మీకు తెలుసా..?

ఇది సింహ గర్జన కాదు.. మొసళ్ల గర్జన.. వీడియో

స్కూటర్‌పై మళ్లీ పాలు అమ్మిన మల్లారెడ్డి..సోషల్‌ మీడియాలో వైరల్‌

చూసి రెండేళ్లయింది.. మాట్లాడి ఏడాదైంది: కుమారుడిని తలుచుకుని ధావన్ కన్నీరు

 

Published on: Feb 22, 2025 02:13 PM