ఓర్నీ.. అది ఆటోనా..ఆర్టీసీ బస్సా..పోలీసులకు షాకిచ్చిన వీడియో
ఒక ఆటోలో ఎంతమంది ప్రయాణించగలరు? నలుగురు లేదా ఆరుగురు. మహా అంటే ముందు, వెనుక కలిపి ఓ 10 మంది వరకూ ప్రయాణిస్తారు. నిజానికి ఆటోలో ఇంతమంది ప్రయాణించడం సురక్షితం కాదు. ఈ విషయం ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా కొందరు పెడచెవిన పెడతారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించుకుని తీసుకెళ్తుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ ఏకంగా 19 మందిని ఆటోలో ఎక్కించుకొని పోలీసులకే షాకిచ్చాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ లో సాధారణ తనిఖీల్లో భాగంగా ఫిబ్రవరి 15న రాత్రివేళ బారుసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై వెళుతున్న ఒక ఆటోను పోలీసులు ఆపారు. ఆటోలో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో అనుమానం వచ్చి చెక్‌పాయింట్ వద్ద ఆ ఆటోను ఆపారు. అందులో ప్రయాణిస్తున్న వారిని ఒక్కొక్కరిగా కిందకు దిగమని చెప్పి, పోలీసులు లెక్కపెట్టారు. మొత్తం ఆటోలోంచి 19 మంది ప్రయాణికులు దిగారు. అంతమంది ఆటోలో ప్రయాణించడం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు… నిబంధనలకు వ్యతిరేకంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు. ఓర్నీ.. అది ఆటోనా.. ఆర్టీసీ బస్సా అంటూ కామెంట్లు చేశారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
