బర్డ్‌ఫ్లూ భయమే లేదు.. అక్కడ ఊరు ఊరంతా పండగే..వీడియో
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథి నుండి ఫిరోజాబాద్ కు కోళ్లను తీసుకెళ్తున్న పికప్ ట్రక్ కన్నౌజ్ ఎక్స్‌ప్రెస్‌వేపై దూసుకెళుతోంది. ఉన్నట్టుండి ట్రక్కు బోల్తా పడింది. అమేథి నుండి ఫిరోజాబాద్ కు కోళ్లను తీసుకెళ్తున్న పికప్ ట్రక్ కన్నౌజ్ ఎక్స్‌ప్రెస్‌వేపై బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ట్రక్కు అదుపు తప్పింది. ఈ ట్రక్కు కోళ్లతో నిండి ఉంది. ట్రక్కు బోల్తా పడగానే కోళ్లన్నీ బయటకు వచ్చాయి. మరో క్షణంలో ఆ పక్కనే ఉన్న గ్రామం మొత్తం అక్కడకు చేరుకుంది. చేతికి దొరికినన్నీ కోళ్లను పట్టుకెళ్లి విందు చేసుకున్నారు.
పోలీసులు, ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చెదరగొట్టారు. గాయపడిన ట్రక్ డ్రైవర్‌ని ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి ట్రక్ డ్రైవర్ కు కునుకు తీయడం కారణంగా ఊరు ఊరంతా చికెన్ పండగ జరుపుకుంది. కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా బండి అదుపుతప్పి ఒక్కసారిగా అది బోల్తా పడింది. దాంతో చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆ ట్రక్కునంతా ఖాళీ చేశారు.. దొరికిన వారికి దొరికన్నీ కోళ్లను పట్టుకుని ఇళ్లకు వెళ్లి పండగ చేసుకున్నారు.
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
