Dragon Movie Review: డ్రాగన్ మూవీ రివ్యూ.. లవ్ టుడే హీరో సినిమా హిట్టా..? ఫట్టా..?
ఓరి దేవుడా అంటూ అశ్వత్ మారిముత్తు ఫస్ట్ సినిమాతో మంచి డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నాడు. సున్నితమైన అంశాలతో మంచి చిత్రాన్ని తీశాడని ప్రశంసలు అందుకున్నాడు. ఇక దర్శకుడిగా, హీరోగా మంచి ఫాంలోకి వచ్చిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు డ్రాగన్ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అశ్వత్, ప్రదీప్ కాంబో అంటే యూత్‌లో మంచి అంచనాలే ఉంటాయి. అలా యూత్‌కు కనెక్ట్ అయ్యే ప్రేమ, బ్రేకప్, కాలేజ్, కెరీర్ అనే అంశాల చుట్టూనే తిప్పాడు. మరి ఇలాంటి మూవీలో కథ ఏంటి? సినిమా ఎలా ఉంది? అన్నది ఓ సారి చూద్దాం.
డి. రాఘవన్ అలియాస్ ప్రదీప్ రంగనాథన్ స్కూల్ టాపర్. ప్లస్ 2 కంప్లీట్ చేసిన తరువాత గోల్డ్ మెడల్ సాధించి తాను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టం.. అసలు అమ్మాయిలకు అలాంటి వారే నచ్చుతారు అని చెబుతుంది. దీంతో డి. రాఘవన్ కాస్తా.. డ్రాగన్ అంటూ ఇంజనీరింగ్ కాలేజ్‌లోకి అడుగుపెడతాడు. అక్కడ కీర్తి అలియాస్ అనుపమ ఈ డ్రాగన్ ప్రేమలో పడుతుంది. ఇంజనీరింగ్ అంతా కలిపి 48 సబ్జెక్టులు బ్యాక్ లాగ్స్ ఉన్న డ్రాగన్‌కు కాలేజ్ ప్రిన్సిపాల్ అలియాస్ మిస్కిన్ ఓ అవకాశం ఇస్తాడు. కానీ ఆ అవకాశాన్ని డ్రాగన్ వాడుకోడు. చివరకు కాలేజ్ నుంచి డ్రాగన్ సస్పెండ్ అవుతాడు. ఆ తరువాత తనకు ఉద్యోగం వచ్చిందని ఇంట్లో తల్లిదండ్రుల్ని రెండేళ్లుగా మ్యానేజ్ చేస్తూనే ఉంటాడు డ్రాగన్. ఫ్రెండ్స్, లవర్ సాయంతో అలా కాలం వెళ్లదీస్తుంటాడు. అలా పనీపాటా, ఓ బాధ్యత అంటూ లేకుండా ఖాళీగా పడి తింటూ బతుకుతున్న డ్రాగన్ మొహం మీదే ఫెయిల్యూర్ అని చెప్పి.. తనకు వచ్చిన మంచి సంబంధానికి ఓకే చెబుతుంది కీర్తి. బ్రేకప్ బాధలో ఉన్న డ్రాగన్.. అడ్డదారిలో ఓ ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. ఆ తరువాత సొంత టాలెంట్‌తో ఎదుగుతూ వస్తాడు. కారు, ఇళ్లు ఇలా అన్నీ వచ్చేస్తాయి. ఇక పల్లవి అలియాస్ కయాదు లోహార్ అనే పెద్దింటి అమ్మాయితోనూ డ్రాగన్ పెళ్లి సెటిల్ అవుతుంది. అన్నీ బాగానే ఉన్నాయని అనుకున్న టైంలో ఈ డ్రాగన్ ఓ సారి కాలేజ్ ప్రిన్సిపాల్‌కు ఎదురు పడతాడు? ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? ఈ ఫేక్ సర్టిఫికెట్ వల్ల వచ్చిన నష్టం ఏంటి? డ్రాగన్ మళ్లీ కాలేజ్‌కు వచ్చి పడ్డ కష్టాలు ఏంటి? చివరకు డ్రాగన్ పరిస్థితి ఏం అవుతుంది? రిమైనింగ్ కథ




