ఖతర్నాక్ ఐడియా.. 15 నిమిషాల్లో ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకున్న విద్యార్ధి..వీడియో
పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. పరీక్షా కేంద్రాలు చూస్తే కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మహానగరాల్లో ట్రాఫిక్ గురించి చెప్పనక్కర్లేదు. అందుకే ఎగ్జామ్‌కి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ రాసేందుకు అనుమతించమని స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. ఎంత ముందు బయలుదేరినా ఒక్కోసారి ట్రాఫిక్ వల్ల సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేక విద్యార్ధులు వెనుదిగిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైన ఓ విద్యార్థి ఖతర్నాక్ ఐడియా వేశాడు. అతనికి ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకోడానికి 15 నిమిషాలే సమయం ఉంది. దీంతో ఆ విద్యార్థి పారాచూట్ సాయంతో పరీక్ష కేంద్రానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక మీడియా ప్రకారం, సమర్థ్ అనే విద్యార్థి వ్యక్తి గత పనికోసం పంచ్‌గని ప్రాంతానికి వెళ్లాడు. అదే రోజు అతడు ఓ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అతడు పని ముగించుకుని ఎగ్జామ్‌కి బయలుదేరే సరికి ఆలస్యం అయిపోయింది. పరీక్షకు ఇంకా 15 నిమిషాల సమయమే మిగిలుంది. ఒక్కసారిగా ట్రాఫిక్ కళ్లముందు కదలాడింది. తనకున్న సమయంలో రోడ్డులో వెళ్తే పరీక్షకు హాజరుకాలేనని అర్థమైంది. దీంతో, అతడు పారాచూట్ సాయంతో పరీక్ష కేంద్రంలో దిగాడు. పంచగనీలోని జీపీ అడ్వంచెర్స్ సంస్థ యజమాని, సాహస క్రీడల నిపుణుడు గోవింద్ యెవాలే అతడికి సహకరించాడు. తన టీంతో కలిసి అతడు అన్ని ఏర్పాట్లు చేశాడు. దీంతో, పారాచూట్ ద్వారా సమర్థ్ గాల్లో తేలుతూ పరీక్ష కేంద్రం వద్ద దిగాడు. పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లతో, నిపుణులైన పారాగ్లైడర్స్ పర్యవేక్షణలో సమర్థ్ తన సాహసాన్ని పూర్తి చేశాడు. కాగా, మహరాష్ట్రలోని సతారా ప్రాంతం పారాగ్లైండింగ్ క్రీడలకు ప్రసిద్ధి. ఇక్కడ సాహసక్రీడలకు అనుకూలమైన అనేక ప్రదేశాలు ఉన్నాయి. మరోవైపు, సమర్థ్ సాహసానికి సంబంధించిన వీడియో నెట్టింట కూడా హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.
మరిన్ని వీడియోల కోసం
దెయ్యాలు రాత్రికి రాత్రే కట్టిన ఈ మిస్టరీ శివాలయం గురించి మీకు తెలుసా..?
ఇది సింహ గర్జన కాదు.. మొసళ్ల గర్జన.. వీడియో
స్కూటర్‌పై మళ్లీ పాలు అమ్మిన మల్లారెడ్డి..సోషల్ మీడియాలో వైరల్
చూసి రెండేళ్లయింది.. మాట్లాడి ఏడాదైంది: కుమారుడిని తలుచుకుని ధావన్ కన్నీరు

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
