Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింహాన్ని రారాజు అని ఇందుకే అన్నారేమో.. వీడియో

సింహాన్ని రారాజు అని ఇందుకే అన్నారేమో.. వీడియో

Samatha J

|

Updated on: Feb 23, 2025 | 2:00 PM

సింహం సింగిల్‌గానే వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయి అని ఓ సినిమా డైలాగ్‌. సింహాన్ని అడవికి రారాజుగా చెబుతారు. ఎంతటి జంతువైనా సింహాన్ని చూస్తే పక్కకు తొలగాల్సిందే. ఇక దీనికి ఆకలి వేసిందో అవతలి జంతువుకి అదే ఆఖరి రోజు అవుతుంది. అలాగే ఆకలి వేస్తుంది కదా అని సింహం గడ్డి మాత్రం తినదు. దాని నడకలోనే కాదు.. దాని ప్రవర్తనలోనూ రాజసం ఉట్టిపడుతుంది. తాజాగా సింహానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు లయన్‌.. ద కింగ్‌ అంటున్నారు.

గుజరాత్‌లోని భావ్‌నగర్‌-సోమ్‌నాథ్ హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఏకంగా పావుగంట సేపు వాహనాలన్నీ రోడ్డుకు ఇరువైపులా సైలెంట్‌గా నిలిచి ఉన్నాయి. ఏం జరిగిందా అని చూస్తే.. ఆ సమయంలో ఓ సింహం రోడ్డు దాటుతోంది. సింహం తల ఎత్తుకొని ఠీవీగా నడుస్తూ.. వెళ్తుండగా వాహనదారులంతా రాజుగారిముందు భటులు చేతులు కట్టుకు నిల్చున్నట్టుగా వాహనాలు ఎక్కడివక్కడే నిలిపివేసి నిశ్శబ్ధంగా చూస్తూ ఉన్నారు. సింహం తన రాజసాన్ని ఒలకబోస్తూ రోడ్డు దాటి వెళ్లిపోయింది. ఈ ఘటన అమ్రేలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సింహం వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు. లయన్‌.. ద లజెండ్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఖతర్నాక్‌ ఐడియా.. 15 నిమిషాల్లో ఎగ్జామ్‌ సెంటర్‌కి చేరుకున్న విద్యార్ధి..వీడియో

ఆ గ్రామానికి ఏమైంది?కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం వీడియో

ఓర్నీ.. అది ఆటోనా..ఆర్టీసీ బస్సా..పోలీసులకు షాకిచ్చిన వీడియో

బర్డ్‌ఫ్లూ భయమే లేదు.. అక్కడ ఊరు ఊరంతా పండగే..వీడియో