చంటిపాపను చంకనెత్తుకొని విధుల్లో పోలీస్..వీడియో
భూమికి ఉన్నంత ఓర్పు మహిళలకు ఉంటుంది అంటారు. కొందరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనంతో వ్యవహరిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ రైల్వే మహిళా కానిస్టేబుల్ తన ఏడాది పాపను చంకనెత్తుకొని విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె నిబద్ధతకు ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన ఏడాది బిడ్డను ఎత్తుకొని విధులు నిర్వర్తిస్తున్నారు.
ఫిబ్రవరి 15వ తేదీన ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగి పలువురు మృత్యవాత పడ్డారు. చాలామంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై స్పందించిన రైల్వే అధికారులు స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇలాంటి సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్ తన బిడ్డను ఎత్తుకొని విధులు నిర్వర్తించారు. ఓవైపు తన బిడ్డ సంరక్షణతోపాటు.. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఒక వ్యక్తి పట్టాలపై ఉన్న రైలుకు ఆనుకొని చల్లటి పానియం తాగుతుండగా ఆమె అతనిని హెచ్చరించి, పక్కకు రమ్మని చెప్పారు. ఆ తర్వాత లాఠీని పట్టుకొని ప్లాట్‌ఫాంపై నడుస్తూ కనిపించారు. చిన్నారిని ఎత్తుకొని విధులు నిర్వహిస్తున్న ఆమె పేరు రీనా. రీనాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె లాఠీని చేతిలో పట్టుకొని ప్లాట్‌ఫాంపై నడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఖతర్నాక్ ఐడియా.. 15 నిమిషాల్లో ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకున్న విద్యార్ధి..వీడియో
ఆ గ్రామానికి ఏమైంది?కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం వీడియో
ఓర్నీ.. అది ఆటోనా..ఆర్టీసీ బస్సా..పోలీసులకు షాకిచ్చిన వీడియో
బర్డ్‌ఫ్లూ భయమే లేదు.. అక్కడ ఊరు ఊరంతా పండగే..వీడియో

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
