కొత్త జియో హాట్‌స్టార్ ఓటీటీ.. రోజుకు రూ.1.66 మాత్రమే..
OTT ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలకు వినోదానికి ప్రధాన మార్గంగా మారాయి. గత సంవత్సరం డిస్నీ, రిలయన్స్, వయాకామ్ 18 విలీనమయ్యాయి. జియో హాట్‌స్టార్ యాప్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందనే చర్చ జరిగింది. ఇప్పుడు వెయిటింగ్ టైమ్ ముగిసింది. ఎందుకంటే జియో సినిమాలు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కంటెంట్‌ను ఒకే యాప్‌లో చూడవచ్చు. జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ రెండు ప్రధాన OTT ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు ఒకటిగా మారాయి. ఒక డివైజ్‌కు జియో హాట్‌స్టార్ నెలవారీ సభ్యత్వాన్ని చాలా తక్కువ ధరకే అందిస్తున్నారు. మొబైల్ వినియోగదారులకు కంపెనీ చౌకైన ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ మూడు నెలలకు రూ.149 ఆఫర్ ధరకు లభిస్తుంది. అంటే నెలకు రూ.50 రూపాయలు రోజుకి రూపాయి 66 పైసలు చెల్లించి 720 పిక్సెల్స్ రిజల్యూషన్ పొందవచ్చు.
ఈ ప్లాన్ ప్రకారం.. మీరు చూసే వీడియో మధ్యలో ప్రకటనలు రావచ్చు. మీరు ఒక సంవత్సరం ప్లాన్ తీసుకుంటే మీరు రూ.499 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే నెలవారీ ఖర్చు రూ.42 మాత్రమే అవుతుంది.మరో మూడు నెలల JioHotstar ప్లాన్ రూ.299కి అందుబాటులో ఉంది. అంటే మీరు నెలకు రూ.100 ఖర్చు చేయాలి. ఈ ప్లాన్ 1 సంవత్సరానికి రూ. 899 కు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ తో మీరు 2 డివైజ్‌లలో టీవీ, మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో 1080 రిజల్యూషన్ లో కంటెంట్‌ను చూడవచ్చు. ఈ ప్లాన్ ప్రకటన రహితం కూడా కాదు. అంటే వీడియోల మధ్య ప్రకటనలు వస్తుంటాయి. ఇక మూడు నెలల ప్లాన్ ధర రూ.499. అంటే ఈ ప్లాన్ ధర నెలకు రూ.166. మీరు ఈ ప్లాన్‌ను ఒక సంవత్సరం పాటు కొనుగోలు చేస్తే, మీరు రూ.1499కే లభిస్తుంది. నెలకు రూ.125 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ 4 డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది.

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
