Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం.. వీడియో

నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం.. వీడియో

Samatha J

|

Updated on: Feb 21, 2025 | 2:54 PM

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. నీతా అంబానీ దాతృత్వ, సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు గ్లోబల్‌ ఛేంజ్‌ మేకర్‌గా నిలుస్తున్నారని మసాచుసెట్స్‌ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు గాను ప్రతిష్ఠాత్మకమైన గవర్నర్ సిటేషన్ అనే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ ప్రదానం చేశారు. ఈ విషయం నీతా అంబానీ కార్యాలయం వెల్లడించింది. నీతా అంబానీని దార్శనిక నాయకురాలిగా, గొప్ప వితరణశీలిగా, నిజమైన గ్లోబల్‌ ఛేంజ్‌మేకర్‌గా గుర్తించారు. భారత్‌లో లక్షలాది మంది జీవితాల్లో విద్య, ఆరోగ్యం సంరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి కోసం అందించిన సేవకు గానూ ఈ ప్రశంసా పత్రం లభించింది.

ఈ కార్యక్రమం బోస్టన్‌లో జరిగిందని నీతా అంబానీ కార్యాలయం పేర్కొంది.ఈ అవార్డు భారతీయ సంప్రదాయాల వైభవానికి, ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రతిభకు దక్కిన గౌరవానికి ప్రతీక అంటున్నారు. సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో ఉన్న నీతా అంబానీ, భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పినందుకు గర్వకారణంగా మారారని అభిప్రాయపడుతున్నారు. ఈ పురస్కారం భారతదేశ ప్రతిభను, సేవా దృక్పథాన్ని, ప్రపంచ మార్పుకు దోహదపడే మార్గదర్శకత్వాన్ని తెలియజేసే గొప్ప గుర్తింపుగా నిలిచిందంటున్నారు. నీతా అంబానీ భారత సంప్రదాయ కళలకు ప్రాతినిధ్యం వహిస్తూ అరుదైన షికార్గా బనారసీ చీరను ధరించారు. ఈ చీర భారతీయ హస్తకళాకారుల ప్రతిభకు అద్దం పట్టేలా, అత్యంత సంక్లిష్టమైన కడ్వా అల్లిక శైలితో రూపొందించబడింది. అలాగే, పారంపర్య కోన్యా డిజైన్‌తో ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకుంది.నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం