తిండి లేదు, స్నానం లేదు.. నరకం అనుభవించిన భారత సంతతికి చెందిన బిలియనీర్ కుమార్తె!
భారత సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్ తన పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. తనపట్ల తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు తెలిపారు. జీవించి ఉన్న వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణతో బలవంతంగా జైలులో ఉంచారన్నారు. తనపై జరిగిన అన్ని దుష్ప్రవర్తన పరిమితులను దాటేశారని ఆమె అన్నారు.

భారత సంతతికి చెందిన బిలియనీర్ కూమార్తె జైలులో నరకం అనుభవిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు తన తీవ్రంగా మానవ హక్కుల ఉల్లంఘనకు గురైనట్లు పేర్కొన్నారు. హత్య అభియోగంతో వసుంధరకు ఉగాండాలో జైలు శిక్ష విధించారు. ఈ సమయంలో ఆమె 3 వారాలు గడిపారు. జైలులో ఉన్నన్ని రోజులు తనను మామూలుగా వ్యక్తిలా చూడలేదన్నారు.
వసుంధర వయసు దాదాపు 26 సంవత్సరాలు. తన తండ్రి పంకజ్ ఓస్వాల్ మాజీ ఉద్యోగి ముఖేష్ మెనారియాను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు గత సంవత్సరం తప్పుడు ఆరోపణలు మోపారు. ఆ తరువాత జరిపిన దర్యాప్తులో ముఖేష్ మెనారియా టాంజానియాలో సజీవంగా ఉన్నట్లు తేలింది. అయితే తనను పోలీసులు ఐదు రోజులు అదుపులోకి తీసుకున్నారని, కానీ మరో రెండు వారాల పాటు జైలులో ఉంచారని అన్నారు. తనపై మానవ హక్కులు తీవ్రంగా ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు. జైలులో ఉన్న సమయంలో స్నానం చేయడానికి కూడా అనుమతి లేదన్నారు.
నాకు ఆహారం, నీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తన పరిస్థితి కారణంగా, తన తల్లిదండ్రులు ఆహారం, నీరు ఇతర ప్రాథమిక అవసరాలను అందించడానికి న్యాయవాదుల ద్వారా పోలీసు అధికారులకు లంచం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తద్వారా ఆహారం, నీరు తీసుకోవడంతో సజీవంగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో జైలు సిబ్బంది ప్రవర్తించిన తీరు దారుణమన్నారు. కనీసం వాష్‌రూమ్‌కి కూడా వెళ్ళడానికి అనుమతించలేదన్నారు. ఇదిలావుంటే, వసుంధర అక్టోబర్ 1, 2024న అరెస్టు అయ్యారు. అక్టోబర్ 21న బెయిల్ పొందారు.
పోలీసులు తనపట్ల అనుచితంగా ప్రవర్శించిన వసుంధర తెలిపారు. ఎటువంటి వారెంట్ లేకుండా ఆమె ఇంట్లో సోదాలు చేసినట్లు పేర్కొన్నారు. వారెంట్ చూపించమని అడిగినప్పుడు, ఉగాండాలో ఉంటున్నారు. మేం ఏదైనా చేయగలం. మీరు ఇప్పుడు యూరప్‌లో లేరని పోలీసులు దౌర్జన్యం చేశారన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ ని కలిసే నెపంతో తనను ఇంటర్ పోల్ కి వెళ్ళమని బలవంతం చేశారన్నారు. అందుకు నిరాకరించడంతో ఒక పురుష అధికారి తనను ఎత్తుకుని తన వ్యాన్ లోకి విసిరేశాడని వసుంధర ఆవేదన వ్యక్తం చేశారు. క్రిమినల్ న్యాయవాది లేకుండానే తనపై బలవంతంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారని ఆమె ఆరోపించారు.
వాంగ్మూలం ఇచ్చిన తర్వాత, ఆమెను ఒక సెల్‌లో నిర్బంధించారు. 30,000 అమెరికన్ డాలర్లు చెల్లించాలని, తన పాస్‌పోర్ట్‌ను సమర్పించాలని కోరారని వసుంధర చెప్పారు. కోర్టుల నుండి బేషరతుగా విడుదల ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా 72 గంటలపాటు అక్రమంగా కస్టడీలో ఉంచారని వసుంధర గోడు వెళ్లబోసుకున్నారు. మెనారియా బతికే ఉందని తెలిసిన తర్వాత కూడా, ఈ ఆరోపణలపై జైలులో ఉంచారు. మెనారియా అక్టోబర్ 10న గుర్తించిన రెండు వారాల తర్వాత బెయిల్ వచ్చింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
