Telangana: డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు.. ఏంటా అని పరిశీలించగా
ఆ నకిలీ నోట్లు ఎక్కడవి? అవి గ్రామంలోకి ఎలా వచ్చాయి?.. ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా 417 నకిలీ 500 నోట్లు బ్యాంక్‌కు చేరాయి. దీనిపై పోలీసులు, బ్యాంక్ అధికారులు కూపీ లాగుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి.

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. జలాల్ పూర్ గ్రామానికి చెందిన రైతు చిన్న సాయిలు కెనరా బ్యాంక్‌లో గతంలో తీసుకున్న క్రాప్ లోన్ చెల్లించడానికి 2 లక్షల 8 వేల 500 రూపాయలు తీసుకువచ్చాడు. క్యాషియర్ యథావధిగా కౌంటింగ్ మెషిన్‌లో వేశారు. అందులో 417 నకిలీ 500 రూపాయల నోట్లు ఉన్నట్లు గుర్తించారు. బ్యాంక్‌కు తీసుకువచ్చిన మొత్తం 2 లక్షల 8500 పూర్తిగా నకిలీ నోట్లు అని తేల్చారు బ్యాంక్ అధికారులు. వెంటనే మేనేజర్ వర్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది చదవండి: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. నకిలీ నోట్ల వ్యవహారం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు సాయిలు దగ్గరకు ఈ మొత్తం ఎక్కడ నుంచి వచ్చింది? దొరికినవి 417 నోట్లు మాత్రమే.. ఇంకా ఎన్ని ఉన్నాయనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. గ్రామీణ ప్రాంతానికి ఈ మొత్తం ఎలా వచ్చిందనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో డబ్బు ప్రవాహం సాగింది. ఈ నకిలీ నోట్లు అందులోనివేనా అన్న అనుమానాలున్నాయి. ఓటర్లకు పంపిన డబ్బుల్లో అసలు ఎంత? నకిలీ ఎంత? అన్న కోణంలో చర్చ సాగుతోంది.
ఇది చదవండి: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








