Telangana: భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు.. వచ్చే రెండు రోజులు.!
చలి చంపేస్తోంది. పొద్దున్నే బయటకొస్తే అంతే సంగతులు అంటూ హెచ్చరిస్తోంది. గత రెండురోజులతో పోల్చుకుంటే చలి ఇంకా పెరిగింది. ఒకవైపు చలి, మరోవైపు కాలుష్యం డేంజర్‌బెల్స్ మోగిస్తున్నాయి. అయితే ఈ అసాధారణ ప్రతికూల వాతావరణం ఇంకెన్నిరోజులు..? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. గత రెండ్రోజులతో పోల్చితే ఇవాళ చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. తెలంగాణలో చాలాచోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పటాన్‌చెరులో 7, ఆదిలాబాద్‌లో 7.2, మెదక్‌లో 8, రాజేంద్రనగర్‌లో 8.5, హనుమకొండలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. అలాగే, హైదరాబాద్‌లో 10.8, నిజామాబాద్‌లో 11.6, హయత్‌నగర్‌లో 12, రామగుండంలో 12, దుండిగల్‌లో 12.2, ఖమ్మంలో 13.4 , నల్గొండలో 13.6, మహబూబ్‌నగర్‌లో 14.5, భద్రాచలంలో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. రాబోయే రెండ్రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. హైదరాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసిన వాతావరణశాఖ.
ఇది చదవండి: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!
అటు ఏపీలోనూ చలి చంపేస్తోంది. రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. డుంబ్రిగూడలో అత్యల్పంగా 4.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో నీళ్లు గట్టకట్టేంతగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అల్లూరి, పార్వతీపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 12 డిగ్రీల్లోపే టెంపరేచర్స్ నమోదవుతున్నాయి.
ఇది చదవండి: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








