Horoscope Today: ఆ రాశివారి పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
దిన ఫలాలు (జనవరి 20, 2024): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (జనవరి 20, 2024): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కొందరు మిత్రులు ఆర్థికంగా నష్టపరిచే అవకాశం కూడా ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. సతీమణి విషయంలో శుభ పరిణామం చోటు చేసుకుం టుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సతీమణిని సంప్రదించడం మంచిది. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రభుత్వపరంగా కొద్దిపాటి లాభాలు ఉంటాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాల వల్ల, కొత్త నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధికి కృషి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగపరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. అధికారుల వేధింపులు కూడా ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు పురోగతి చెందడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. ఆరోగ్యం పరవా లేదు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు సమస్యల నుంచి బయటపడ తారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సాధారణ ఫలితాలని స్తాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా లేదు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. పరవాలేదనిపిస్తుంది. వాహన ప్రమాదాల విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఎటువంటి ప్రయత్నమూ చేయకుండానే ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతారు. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. జీతభత్యాలకు సంబంధించి వృత్తి, ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరగవచ్చు. పెళ్లి , ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సతీమణికి వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సాహం, ఆద రణ పెరుగుతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందికీ ఆస్కారం లేదు. రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ సమేతంగా దైవకార్యాల్లో పాల్గొంటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆస్తి సమస్య పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. గృహ, వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇంటా బయటా అనుకూలతలు ఉంటాయి. ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూ లంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సతీమణికి కూడా వృత్తి, ఉద్యో గాలలో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక ప్రయత్నాల్లో కొద్దిగా ఆటంకాలు ఉండవచ్చు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. బంధువులతో చికాకులు తలె త్తుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ, లక్ష్యాలను, బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. తల్లితండ్రుల జోక్యంతో తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది కానీ, కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.