Romantic Life Astrology: కుజ, శుక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారు లైంగిక వాంఛల పట్ల జాగ్రత్త..!

కుజ, శుక్రులు ఎప్పుడు ఎక్కడ కలిసినా శృంగార జీవితంలో ఒక కలకలం, ఒక సంచలనం తప్పకుండా ఏర్పడతాయి. జ్యోతిషశాస్త్రంలో కుజుడు పురుషుడు కాగా, శుక్రుడు స్త్రీ సంబంధమైన గ్రహం. ఇవి రెండు ఒక రాశిలో కలిసినప్పుడు తప్పకుండా లైంగిక కార్యకలాపాల్లో, దాంపత్య జీవితంలో పెను మార్పులు చోటుచేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Romantic Life Astrology: కుజ, శుక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారు లైంగిక వాంఛల పట్ల జాగ్రత్త..!
Romantic Life
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 20, 2024 | 12:01 PM

కుజ, శుక్రులు ఎప్పుడు ఎక్కడ కలిసినా శృంగార జీవితంలో ఒక కలకలం, ఒక సంచలనం తప్పకుండా ఏర్పడతాయి. జ్యోతిషశాస్త్రంలో కుజుడు పురుషుడు కాగా, శుక్రుడు స్త్రీ సంబంధమైన గ్రహం. ఇవి రెండు ఒక రాశిలో కలిసినప్పుడు తప్పకుండా లైంగిక కార్యకలాపాల్లో, దాంపత్య జీవితంలో పెను మార్పులు చోటుచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఈ రెండు గ్రహాలు గురువుకు చెందిన ధనూ రాశిలో కలవడం వల్ల కొంత తగ్గి ఉంటాయి కానీ, అసలు లేకుండా మాత్రం ఉండదు. మిగిలిన అన్ని రాశుల కంటే వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లైంగిక వాంఛలు, శృంగార జీవితం హద్దులు దాటే అవకాశం ఉంటుంది. లైంగిక వాంఛలు పెరిగి.. అక్రమ సంబంధాలకు దారితీసే అవకాశం ఉన్నందున వారు జాగ్రత్తగా ఉండాలి. ఇది దాదాపు ఫిబ్రవరి 15 వరకూ కొనసాగే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశ్యధిపతి శుక్రుడు, కుజుడితో కలిసి అష్టమ స్థానంలో, అంటే గుంభన స్థానంలో, సంచారం చేస్తున్నందువల్ల లైంగికంగా రహస్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. మామూలుగానే శృంగార సంబంధమైన యావ ఎక్కువగా ఉండే ఈ రాశివారు ఈ రెండు గ్రహాల కలయిక కార ణంగా మరింత విజృంభించడం జరుగుతుంది. సాధారణంగా అక్రమ సంబంధాలు ఏర్పరచుకోవడాబనికి అవకాశం ఉన్నందున జాగ్రత్త. విహార యాత్రలు చేయడం, ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో శుక్ర, కుజుల సంచారం తప్పకుండా శృంగారపరంగా విజృంభించ డానికి అవకాశం కల్పిస్తుంది. ఈ రాశివారు శృంగార కార్యకలాపాలను పెంచుకోవడంతో పాటు, వ్యసనాలకు కూడా అలవాటు పడే అవకాశం ఉంటుంది. అక్రమ సంబంధాలు ఏర్పరచుకోవ డానికి, అనవసర పరిచయాలు పెంచుకోవడానికి వారికి అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. అనవసర పరిచయాలపైనా, వ్యసనాలపైనా బాగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది.
  3. కన్య: ఈ రాశికి చతుర్థ స్థానంలో, అంటే సుఖ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల లైంగిక కార్య కలాపాల విషయంలో ముందూ వెనుకా చూసుకునే అవకాశం కూడా ఉండదు. అహర్నిశలూ ఇదే యావలో ఉండడం జరుగుతుంది. అయితే, ఎక్కువగా దాంపత్య జీవితంలోనే సుఖ సంతోషా లను పొందడం జరుగుతుంది. సతీమణికి మంచి గృహ యోగం పట్టే అవకాశం ఉంటుంది. అంద మైన ప్రాంతాలకు విహార యాత్రలు చేసే సూచనలున్నాయి. వ్యసనాలకు అలవాటు పడవచ్చు.
  4. తుల: ఈ రాశి అధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో కుజుడితో యుతి చెందడం వల్ల తప్ప కుండా శృంగార జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. అక్రమ సంబంధాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యసనాల మీద ఖర్చు పెరుగుతుంది. సరికొత్త పరిచయాలు ఏర్పడతాయి. విహార యాత్రలు, ప్రేమలు పెరుగుతాయి. కొత్త వారితో కొత్త ప్రాంతాలు దర్శించే అవకాశం కూడా ఉంది. ప్రేమ జీవితం, దాంపత్య జీవితంలో లైంగిక సంబంధంగా అనుకూలతలు బాగా పెరుగుతాయి.
  5. మకరం: ఈ రాశికి వ్యయ స్థానంలో, అంటే శయన స్థానంలో శుక్ర, కుజుల కలయిక వల్ల లైంగిక కార్య కలాపాలు విస్తృతం కావడం, అనవసర పరిచయాలు ఏర్పడడం, అక్రమ సంబంధాలకు అవకాశం ఉండడం జరుగుతుంది. అనవసర పరిచయాలు మీద బాగా ఖర్చు పెరిగే సూచనలున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు, విహార యాత్రలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో మరింతగా సుఖ సంతోషాలు పెరగడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.