Weekly Horoscope: వారికి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది.. 12 రాశుల వారికి వారఫలాలు..!

వార ఫలాలు (జనవరి 21 నుంచి జనవరి 27, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారం వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Weekly Horoscope: వారికి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది.. 12 రాశుల వారికి వారఫలాలు..!
Weekly Horoscope 21st Jan To 27th Jan 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 21, 2024 | 4:55 AM

వార ఫలాలు (జనవరి 21 నుంచి జనవరి 27, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారం వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశివారికి వారమంతా అనుకూలంగా సాగిపోతుంది. శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా డబ్బు నష్టపోయే సూచన లున్నాయి.కుటుంబ సభ్యులతో ఆనం దంగా కాలక్షేపం చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమా చారం అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విదే శాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

శుభ గ్రహాల అనుకూలతలు తక్కువగా ఉన్నందువల్ల ఈ వారం ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఒక మోస్తరుగా సాగుతాయి. కుటుంబపరంగా ఒక శుభకార్యం నిర్వహించడం జరుగుతుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అసంతృప్తి తలెత్తుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు పడతారు. నిరుద్యోగులకు బాగా దూరప్రాంతం నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. హామీలు ఉండకపోవడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ధన కారకుడైన గురువు లాభ స్థానంలో ఉన్నందువల్ల సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా బాగా ఉపయోగ పడతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు విస్తరి స్తాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటివి కూడా ఆశించిన ఫలితాలను ఇస్తాయి. బంధు మిత్రు లతో శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ధన స్థానాధిపతి రవి, పంచమ స్థానాధిపతి కుజుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటు వంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక విషయాలు రాణిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక సహాయం విషయంలో బంధుమిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలు అవుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అయిదు గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడంతో వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లబ్ధి పొందుతారు. ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగు తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇరుగు పొరుగు సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూల కాలం. ఎటువంటి వ్యవహారమైనా సఫలం అవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం కావచ్చు. వృత్తి, ఉద్యోగాలపరంగా అధిక ప్రయోజనాలను పొందు తారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాలు లాభాలను తెచ్చిపెడతాయి. నిరుద్యో గులకు సమయం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించి పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా ముందుకు సాగుతాయి. ఇతరులకు డబ్బు ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ చేయకపోవడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. ఈ అనుకూల సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మొత్తం మీద వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఎటువంటి ప్రయత్నాలయినా విజయవంతం అవుతాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. తల పెట్టిన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు ఊపందుకుంటాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ధన స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల తప్పకుండా ఆర్థిక సంబంధమైన విషయాలన్నీ అను కూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా లాభిస్తాయి. వ్యక్తిగతంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు లోటుండదు. సమాజంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యో గాలలో ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్ర మాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దూరప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో విద్యార్థులు బాగా రాణిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రాశ్యధిపతి గురువు పంచమంలో ఉండడంతో పాటు, ధనూ రాశిలో శుభ గ్రహాల సంచారం జరు గుతున్నందువల్ల వారమంతా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ధనపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తి వివాదం సానుకూలపడుతుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కొద్ది పాటి వ్యయ ప్రయాసలతో మంచి ఫలితాలు సాధిస్తారు. వారమంతా సానుకూలంగా గడిచి పోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ప్రోత్సాహకాలు, ప్రతిఫలాలు అందుతాయి. కొందరు బంధుమిత్రుల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్త వింటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేయకండా పూర్తి చేయడం మంచిది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలలో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల చదు వుల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సతీమణితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. విద్యార్థులకు సమయం బాగుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగి పోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ధన స్థానంలో సంచరిస్తున్న రాశ్యధిపతి గురువు కారణంగా ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలుం టాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులు సహాయ సహకారాలు అందజేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృథా ఖర్చు లకు కళ్లెం వేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించినంత సంతృప్తికరంగా సాగకపోవచ్చు. శుభవార్తలు వింటారు.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ