Marriage Astrology: ధనూ రాశిలోకి శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారి ఇళ్లలో ఇక పెళ్లి బాజాలు..!
Shukra Gochar 2024: శుక్రుడు ఈ నెల 18 నుంచి ధనూరాశిలో సంచారం ప్రారంభించినప్పటి నుంచి శుభకార్యాలకు సమయం అనుకూలంగా మారుతుంది. ధనూ రాశి శుభ కార్యాలకు అవకాశం కల్పిస్తుంది. ఈ రాశిలో ఏ గ్రహం ప్రవేశించినా శుభాలకే తప్ప అశుభాలకు అవకాశం ఉండదు. పైగా ధనూ రాశిలో ప్రవేశించిన శుక్రుడికి గురు వీక్షణ కూడా ఉన్నందువల్ల శుక్రుడు మరింత అనుకూలమైన ఫలితాలనిస్తాడు.
శుక్రుడు ఈ నెల 18 నుంచి ధనూరాశిలో సంచారం ప్రారంభించినప్పటి నుంచి శుభకార్యాలకు సమయం అనుకూలంగా మారుతుంది. ధనూ రాశి శుభ కార్యాలకు అవకాశం కల్పిస్తుంది. ఈ రాశిలో ఏ గ్రహం ప్రవేశించినా శుభాలకే తప్ప అశుభాలకు అవకాశం ఉండదు. పైగా ధనూ రాశిలో ప్రవేశించిన శుక్రుడికి గురు వీక్షణ కూడా ఉన్నందువల్ల శుక్రుడు మరింత అనుకూలమైన ఫలితాలనిస్తాడు. అంతేకాక, ఇక్కడ ఇప్పటికే కుజుడు కూడా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం అయినా విజయవంతం అవుతుంది. మొత్తం మీద ధనూ రాశిలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల, అక్కడ కుజుడితో యుతి చెందడం వల్ల మేషం, మిథునం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశుల వారు పెళ్లి పరంగా శుభ ఫలితాలను అనుభవించబోతున్నారు. అంటే ఏడు రాశుల వారు పెళ్లి ప్రయత్నాలలో విజయాలు సాధించబోతున్నారు.
- మేషం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో, అంటే 9వ స్థానంలో కుజ, శుక్రులు యుతి చెందడం వల్ల కొద్ది ప్రయత్నంతో అనేక సంబంధాల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. విదేశీ సంబంధాలు అవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం అవడానికి అవకాశం ఉంది. బంధు వర్గం నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఫిబ్రవరి 11 లోపు పెళ్లి ప్రయత్నాలు చేయడం మంచిది.
- మిథునం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో, అంటే కళత్ర స్థానంలో కుజ, శుక్రుల సంచారం జరుగుతున్నందు వల్ల కొద్ది ప్రయత్నంతో బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదరడానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయ త్నాలు ముమ్మరం చేసే పక్షంలో ఫిబ్రవరి 11 లోపు పెళ్లి కావడానికి కూడా అవకాశం ఉంది. సాధారణంగా వధూవరులిద్దరూ ఇష్టపడి చేసుకునే అవకాశం ఉంది. పెళ్లికి భారీగా ఖర్చు కావడా నికి, వైభవంగా జరగడానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది.
- సింహం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ, శుక్రుల యుతి జరుగుతున్నందువల్ల తప్పకుండా పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. గతంలో ప్రయత్నించిన సంబంధాలు మళ్లీ ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. సాధారణంగా బాగా పరిచయస్థులు లేదా వృత్తి, ఉద్యోగాల్లో సహో ధ్యోగులు కావడం గానీ జరుగుతుంది. ప్రేమ పెళ్లి సూచనలు కూడా ఉన్నాయి. కుజ, శుక్రుల కలయిక వల్ల భారీ ఖర్చు తప్పకపోవచ్చు. పెళ్లి వైభవంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- తుల: ఈ రాశివారికి సప్తమ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో కుజ, శుక్రులు ఉండడం వల్ల అతి త్వరలో పెళ్లయ్యే అవకాశం ఉంది. అప్రయత్నంగా కూడా మంచి పెళ్లి సంబంధం కుదరడానికి అవకాశం ఉంది. బాగా సన్నిహితులు లేదా దగ్గర బంధువుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది. కళత్ర స్థానాధిపతి అయిన కుజుడు, రాశ్యధిపతి అయిన శుక్రుడితో కలిసినందువల్ల ఇష్టపడి పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పెళ్లి తప్పకుండా వైభవంగా జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశివారికి కుటుంబ స్థానంలో శుక్రుడు రావడమనేది తప్పకుండా పెళ్లి బాజాలు మోగిస్తుంది. సప్తమ స్థానాధిపతి శుక్రుడితో, రాశ్యదిపతి కుజుడు యుతి చెందుతున్నందువల్ల ప్రేమ వ్యవ హారమే పెళ్లికి దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది. బాగా తెలిసిన వ్యక్తితో లేదా సన్నిహితుడితో పెళ్లి నిశ్చయం అవుతుంది. సహోద్యోగులు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. పెళ్లి ఆడంబ రంగా జరుగుతుంది. పెళ్లికి బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.
- ధనుస్సు: ఈ రాశిలో కుజ, శుక్రుల యుతి జరిగినందువల్ల మొదటి చూపులోనే ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. పెళ్లిపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా తప్పకుండా సఫలం అవుతుంది. సాధారణంగా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో గానీ, తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తితో గానీ పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. పెళ్లి ఆడంబరాలు, ఆర్భా టాల మధ్య జరిగే అవకాశం ఉంది. బాగా దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
- కుంభం: ఈ రాశికి లాభస్థానంలో శుక్రుడు, కుజుడు కలవడం వల్ల సాధారణంగా ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీసే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న పక్షంలో తప్పకుండా ఫిబ్రవరి 11 లోపు పెళ్లి నిశ్చయం అవుతుంది. హంగూ, ఆర్భాటాల మధ్య వివాహం జరుగు తుంది. ఒకరికొకరు బాగా తెలిసిన వ్యక్తుల మధ్య పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం మీద అప్రయత్నంగా, అనుకోకుండా ఆశించిన పెళ్లి సంబంధం కుదరడానికి అవకాశం ఉంది.