Ayodhya Ram Lalla: బంగారు బాణం చేతబూని చిరునవ్వుతో బాల రాముడు.. ఫస్ట్ లుక్ రివీల్..

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సంప్రోక్షణ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన ఆలయ అధికారులు గర్భ గుడిలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే గురువారం గర్భగుడి లోపల విగ్రహం ఉంచిన ఫొటోలు విడుదల కాగా.. ఆ విగ్రహం తలపై పసుపు గుడ్డ కప్పి ఉంచారు. ఈ రోజు ఉదయం విగ్రహం కళ్ళు మాత్రమే కప్పబడిన మరో చిత్రం బయటపడింది. పూర్తి రూపాన్ని చివరకు మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ విగ్రహం బాల రాముడి ముఖంతో పాటు బంగారు విల్లు, బాణాన్ని పట్టుకున్నట్లు చూపిస్తోంది. 

Ayodhya Ram Lalla: బంగారు బాణం చేతబూని చిరునవ్వుతో బాల రాముడు.. ఫస్ట్ లుక్ రివీల్..
Ram Lalla In Ayodhya1
Follow us
Surya Kala

|

Updated on: Jan 19, 2024 | 5:29 PM

అయోధ్య రామ మందిరంలోని మొదటి అంతస్థులో గర్భ గుడిలో బాల రాముడి విగ్రహము ఏర్పాటు చేశారు.  ఈ రామ్ లల్లా విగ్రహం సోమవారం నాడు జరిగే పవిత్రోత్సవానికి రెండ్రోజుల ముందు అంటే ఈరోజు బహిర్గతమైంది. 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహం నల్లరాతితో మలచబడింది. ఐదు ఏళ్ల ప్రాయంలో రామచంద్రుడు బంగారు విల్లు, బాణం పట్టుకుని నిలబడి ఉన్న భంగిమలో దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహాన్ని కర్ణాటక లోని మైసూర్‌కు చెందిన కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కారు.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సంప్రోక్షణ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన ఆలయ అధికారులు గర్భ గుడిలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే గురువారం గర్భగుడి లోపల విగ్రహం ఉంచిన ఫొటోలు విడుదల కాగా.. ఆ విగ్రహం తలపై పసుపు గుడ్డ కప్పి ఉంచారు.

ఈ రోజు ఉదయం విగ్రహం కళ్ళు మాత్రమే కప్పబడిన మరో చిత్రం బయటపడింది. పూర్తి రూపాన్ని చివరకు మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ విగ్రహం బాల రాముడి ముఖంతో పాటు బంగారు విల్లు, బాణాన్ని పట్టుకున్నట్లు చూపిస్తోంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ నెల 22వ తేదీన ఘనంగా జరిగే వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు. ఇప్పటికే రామ్ లల్లా విగ్రహం ఆలయంలో ప్రతిష్టించబడింది. మౌలిక సదుపాయాలు,  వైద్య సదుపాయాలు, మందులతో సహా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి” అని శ్రీ పాఠక్ చెప్పారు.

సోమవారం అయోధ్యలో జరిగే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ముఖేష్ అంబానీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ 8,000 మంది అతిథి జాబితాలో ఉన్నారు .

ఆలయ సంప్రోక్షణకు సంబంధించిన ఆచారాలు జనవరి 12న ప్రారంభమయ్యాయి. జనవరి 22న ‘ప్రాణ్ ప్రతిష్ఠ’కు ప్రధాని మోడీ పూజలు చేస్తారని వర్గాలు తెలిపాయి. లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం ప్రాణ్ ప్రతిష్ఠా ప్రధాన క్రతువులను నిర్వహిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ