Gautam Gambhir: నిన్న జాకీష్రాఫ్‌.. ఇవాళ గౌతమ్‌ గంభీర్‌.. ఏం చేశారో చూడండి.! వీడియో వైరల్.

Gautam Gambhir: నిన్న జాకీష్రాఫ్‌.. ఇవాళ గౌతమ్‌ గంభీర్‌.. ఏం చేశారో చూడండి.! వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Jan 19, 2024 | 6:27 PM

ప్రస్తుతం దేశమంతా రామనామం జపిస్తోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న జరిగే ఈ మహాక్రతువు కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున దేశంలోని అన్ని ఆలయాలు సిద్ధం కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

ప్రస్తుతం దేశమంతా రామనామం జపిస్తోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న జరిగే ఈ మహాక్రతువు కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున దేశంలోని అన్ని ఆలయాలు సిద్ధం కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇందుకోసం దేవాలయాలన్నింటినీ స్వచ్ఛందంగా శుభ్రం చేయాలని సూచించారు. ప్రధాని పిలుపుతో ఇప్పటికే చాలామంది తమ తమ ప్రాంతాల్లోని దేవాలయాలను శుభ్రం చేస్తున్నారు. అనంతరం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ ఢిల్లీ కరోల్ బాగ్‌లోని శివాలయాన్ని శుభ్రం చేశారు. పరమశివుని దర్శనం కోసం వచ్చిన ఆయన స్వయంగా ఆలయాన్ని క్లీన్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గంభీర్‌ సింప్లిసిటీకి అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బాలీవుడ్‌ సీనియర్‌ హీరో జాకీష్రాప్‌ కూడా రామాలయాన్ని శుభ్రం చేశారు. స్వయంగా గుడి మెట్లను క్లీన్‌ చేస్తూ కనిపించారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేవాలయాలను శుభ్రం చేసిన తర్వాత ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. సెలబ్రిటీలు స్వచ్ఛ అభియాన్‌ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos