Viral: విమాన టాయిలెట్‌లో చిక్కుకున్న ప్రయాణికుడు.! ఎంత ప్రయత్నించినా తెరుచుకోని డోర్‌

Viral: విమాన టాయిలెట్‌లో చిక్కుకున్న ప్రయాణికుడు.! ఎంత ప్రయత్నించినా తెరుచుకోని డోర్‌

Anil kumar poka

|

Updated on: Jan 19, 2024 | 4:17 PM

విమానంలో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్‌ టేకాఫ్‌ కాగానే టాయిలెట్‌ రూమ్‌కు వెళ్లిన అతడు అందులోనే చిక్కుకుపోయాడు. ఈ ఘటన స్పైస్‌జెట్‌ విమానంలో మంగళవారం చోటు చేసుకొంది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం SG268 విమానం ముంబయి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కాసేపటికి ప్రయాణికుడు టాయిలెట్‌కు వెళ్లాడు. అనంతరం డోర్‌ తెరుచుకోకపోవడంతో బయటకు రాలేకపోయాడు. భయాందోళనకు గురైన అతడు సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు. తలుపును తెరిచేందుకు సిబ్బంది తీవ్రంగా యత్నించినా.. ఫలితం లేకపోయింది.

విమానంలో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్‌ టేకాఫ్‌ కాగానే టాయిలెట్‌ రూమ్‌కు వెళ్లిన అతడు అందులోనే చిక్కుకుపోయాడు. ఈ ఘటన స్పైస్‌జెట్‌ విమానంలో మంగళవారం చోటు చేసుకొంది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం SG268 విమానం ముంబయి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కాసేపటికి ప్రయాణికుడు టాయిలెట్‌కు వెళ్లాడు. అనంతరం డోర్‌ తెరుచుకోకపోవడంతో బయటకు రాలేకపోయాడు. భయాందోళనకు గురైన అతడు సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు. తలుపును తెరిచేందుకు సిబ్బంది తీవ్రంగా యత్నించినా.. ఫలితం లేకపోయింది. దీంతో అతడు దాదాపు 100 నిమిషాల పాటు టాయిలెట్‌లోనే ఉండాల్సి వచ్చింది. విమానం బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన అనంతరం ఇంజినీర్లు వచ్చి తలుపు పగలగొట్టి ప్రయాణికుడిని బయటకు తీసుకువచ్చారు. అనంతరం అతడికి ప్రథమ చికిత్స అందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos