Ayodhya: రామ నామ స్మరణతో మారుమ్రోగిన బ్రిటన్ పార్లమెంట్.. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ

బ్రిటన్ పార్లమెంట్‌లో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. హౌస్ ఆఫ్ కామన్స్ గది శ్రీరామ నామ స్మరణతో మారు మ్రోగింది. బ్రిటన్ పార్లమెంట్‌లో రామమందిరానికి చెందిన సనాతన సంస్థ (ఎస్‌ఎస్‌యుకె) వేడుకలను రామ భజనతో  ప్రారంభించింది. అనంతరం SSUK సభ్యులు కాకభూషుండి సంవాదాన్ని ప్రదర్శించారు. అనంతరం  గీతలోని 12వ అధ్యాయాన్ని పఠించి శ్రీ కృష్ణుడిని కీర్తించారు. 

Ayodhya: రామ నామ స్మరణతో మారుమ్రోగిన బ్రిటన్ పార్లమెంట్.. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
Uk Parliament Celebrations
Follow us
Surya Kala

|

Updated on: Jan 19, 2024 | 8:58 PM

అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం.. బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం పట్ల ఆనందం వెల్లడించిన యూకే ప్రభుత్వం తమ సంఘీభావాన్ని ప్రకటించింది. అంతేకాదు బ్రిటన్ పార్లమెంట్‌లో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. హౌస్ ఆఫ్ కామన్స్ గది శ్రీరామ నామ స్మరణతో మారు మ్రోగింది.

బ్రిటన్ పార్లమెంట్‌లో రామమందిరానికి చెందిన సనాతన సంస్థ (ఎస్‌ఎస్‌యుకె) వేడుకలను రామ భజనతో  ప్రారంభించింది. అనంతరం SSUK సభ్యులు కాకభూషుండి సంవాదాన్ని ప్రదర్శించారు. అనంతరం  గీతలోని 12వ అధ్యాయాన్ని పఠించి శ్రీ కృష్ణుడిని కీర్తించారు.

‘శ్రీ రామ్’ నినాదాలతో ప్రతిధ్వనించిన బ్రిటీష్ పార్లమెంట్

తొలిసారిగా బ్రిటిష్ పార్లమెంట్ లో ఆధ్యాత్మికత, మత సామరస్యం ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలను  నిర్వహించారు. గురువారం దేశవ్యాప్తంగా 200 దేవాలయాలు, కమ్యూనిటీ సంస్థలు, సంఘాలు సంతకం చేసిన UK డిక్లరేషన్‌ను ప్రాణ ప్రతిష్ఠా వేడుకకు ముందు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందించనున్నారు. పవిత్రోత్సవానిక ముందు ఐక్యతకు నిలువెత్తు నిదర్శనమైన యూకే డిక్లరేషన్‌ను అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన పట్ల UKలోని ధార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..