Everest triumph: ఆమె వయసేంటి.. సాధించిన ఘనతేంటి.? నాలుగేళ్ల వయసులో రికార్డు!
చెక్ రిపబ్లిక్‌కు చెందిన చిన్నారి జారా సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగేళ్ల అతి పిన్న వయసులో ఏకంగా ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకు ఎక్కేసింది. అక్కడికి చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు స్థాపించింది. చెక్ దేశస్థురాలైనప్పటికీ జారా తన కుటుంబంతో కలిసి మలేసియాలో ఉంటోంది. ఇటీవల ఆమె తన తండ్రి డేవిడ్ సిఫ్రా, ఏడేళ్ల సోదరుడితో కలిసి ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వద్దకు చేరుకుంది. ఆ దృశ్యాలను ఆమె కుటుంబం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘చిన్నారి జారా ఎప్పుడూ వేన్నీళ్లతో స్నానం చేయదనీ మంచు ముక్కలతో ఆడుకుంటుందని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
చెక్ రిపబ్లిక్‌కు చెందిన చిన్నారి జారా సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగేళ్ల అతి పిన్న వయసులో ఏకంగా ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకు ఎక్కేసింది. అక్కడికి చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు స్థాపించింది. చెక్ దేశస్థురాలైనప్పటికీ జారా తన కుటుంబంతో కలిసి మలేసియాలో ఉంటోంది. ఇటీవల ఆమె తన తండ్రి డేవిడ్ సిఫ్రా, ఏడేళ్ల సోదరుడితో కలిసి ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వద్దకు చేరుకుంది. ఆ దృశ్యాలను ఆమె కుటుంబం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘చిన్నారి జారా ఎప్పుడూ వేన్నీళ్లతో స్నానం చేయదనీ మంచు ముక్కలతో ఆడుకుంటుందని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. అందుకేనేమో ఎవరెస్ట్‌ను అధిరోహించడంలో ఆమె ఇబ్బందులేవీ ఎదుర్కోలేదనీ కొన్నిసార్లు మిగతా ట్రెక్కర్ల కంటే వేగంగా ముందుకెళ్లిందని తెలిపారు. జారాకు చిన్నప్పటి నుంచి నడవడం అంటే చాలా ఇష్టమని, రోజుకు కనీసం 5-10 కిలోమీటర్లు నడుస్తుందని తండ్రి సిఫ్రా తెలిపారు. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు చేసే ప్రయాణంలో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఉష్ణోగ్రతలు ఒక్కోసారి -25 డిగ్రీలకు పడిపోతాయి. అలాంటి కఠిన పరిస్థితులను తట్టుకుంటూ జారా.. సముద్రమట్టానికి సుమారు 17,500 అడుగుల ఎత్తులో ఉండే బేస్‌క్యాంప్ వద్దకు చేరుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు భారత్‌కు చెందిన ప్రిషా లోకేశ్ నికాజూ పేరిట ఉండేది. ప్రిషా గతేడాది అయిదేళ్ల వయసులో ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌ను చేరుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos