AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ముందు ఆపిన కారు రాత్రికి రాత్రే మాయం.. పోలీసుల దర్యాప్తులో ఊహించని ట్విస్ట్..!

అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లు.. కొన్ని కేసులకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో నేరస్థులు ఎవరో కావచ్చని భావిస్తే.. చివరకు దర్యాప్తులో నేరం చేసింది సొంత వారేనని తెలిసి షాక్‌కు గురికావడం పోలీసులు, బాధితులు వంతు అవుతోంది.

ఇంటి ముందు ఆపిన కారు రాత్రికి రాత్రే మాయం.. పోలీసుల దర్యాప్తులో ఊహించని ట్విస్ట్..!
Representative Image
Janardhan Veluru
|

Updated on: Jan 19, 2024 | 1:07 PM

Share

అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లు.. కొన్ని కేసులకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో నిందితులు ఎవరో కావచ్చని భావిస్తే.. చివరకు పోలీసుల దర్యాప్తులో నిందితులు సొంత వారేనని తెలడంతో పోలీసులు, బాధితులు షాక్ అవుతుంటారు. ఇలాంటి ఓ దొంగతనం కేసు గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. ఓ కారు దొంగతనం కేసుకు సంబంధించిన పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్నా పోలీసులు తెలిపిన వివరాల మేరకు జనవరి 16న తన కారు దొంగతనం పోయినట్లు కంచన్ రాజ్‌పుత్ అనే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ హౌసింగ్ సొసైటీలోని తన ఇంటి బయట రాత్రి నిలిపి ఉంచిన స్విఫ్ట్ డిజైర్ కారు ఉదయానికి కనిపించకుండా పోయిందని కంచన్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపింది. కారు విలువ దాదాపు రూ.4.5 లక్షలుగా వెల్లడించింది. కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. ముందుగా ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని సేకరించారు. కంచన్ భర్త గోవర్ధన్‌పై అనుమానం కలగడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత తనకు ఏమీ తెలీదని బుకాయించినా.. కొన్ని ఆధారాలను బయటపెట్టి ప్రశ్నించడంతో గోవర్ధన్ దారిలోకి వచ్చాడు. తనకు చాలా అప్పులు ఉండడంతో తన స్నేహితుడు ఇక్బాల్ పఠాన్‌తో కలిసి భార్య కారును దొంగిలించినట్లు నేరాన్ని అంగీకరించాడు.

తాను కారుపై లోన్ తీసుకున్నానని, వాయిదాలు చెల్లించలేక ఆ కారును దొంగిలించడానికి పథకం రచించినట్లు గోవర్ధన్ పోలీసులకు తెలిపారు. కారు దొంగతనం తర్వాత, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భార్యకు అతనే సూచించినట్లు పోలీసులు తెలిపారు. అప్పులు తీర్చేందుకు భార్య కారును దొంగిలించి.. పోలీసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కట్టుకథనాలు సృష్టించినట్లు నిర్ధారణ కావడంతో గోవర్ధన్‌ను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

దొంగతనం జరగడానికి పది రోజుల ముందు దీనికి సంబంధించి పథకాన్ని రచించారు. డూప్లికేట్ కీని తయారు చేసి ఇక్బాల్‌కు దొంగతనం కోసం ఇచ్చాడు. ముందస్తు ప్లాన్ మేరకు జనవరి 6న గోవర్థన్ రాజస్థాన్‌కు వెళ్లాడు. తద్వారా ఎవరికీ అనుమానం రాకూడదన్నది అతని ప్లాన్. దొంగతనం జరిగిన రోజు రాత్రి 11 గంటలకు గోవర్ధన్ నివాసముంటున్న సొసైటీలోకి ఇక్బాల్ తన స్నేహితుడితో కలిసి రావడం సీసీటీవీలో రికార్డయ్యాయి. కారును దొంగిలించిన ఇక్బాల్, అతని స్నేహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మొత్తానికి తన అప్పులు తీర్చేందుకు భార్య కారును స్వయాన భార్త దొంగతనం చేయించిన వ్యవహారం గుజరాత్‌లో చర్చనీయాంశంగా మారింది.