Best Rice in World 2024: మన ‘బాస్మతి’కి యావత్‌ ప్రపంచం ఫిదా.. అత్యుత్తమ బియ్యంగా గుర్తింపు

ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా బాస్మతి బియ్యం గుర్తింపు దక్కించుకుంది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2023-24 సంవత్సరానికిగానూ ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యం జాబితాను విడుదల చేసింది. ఇందులో బాస్మతి మొదటి స్థానంలో నిలవగా, ఇటలీకి చెందిన అర్బోరియో రెండో స్థానంలో, పోర్చుగల్‌కు చెందిన కరోలినా రైస్ మూడో స్థానంలో నిలిచాయి. బాస్మతి అన్నం, అద్భుతమైన సువాసన, రుచి, పొడవైన ఆకారం ఉన్నప్పటికీ..

Best Rice in World 2024: మన 'బాస్మతి'కి యావత్‌ ప్రపంచం ఫిదా.. అత్యుత్తమ బియ్యంగా గుర్తింపు
Basmati Rice
Follow us
Srilakshmi C

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 25, 2024 | 7:19 PM

ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా బాస్మతి బియ్యం గుర్తింపు దక్కించుకుంది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2023-24 సంవత్సరానికిగానూ ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యం జాబితాను విడుదల చేసింది. ఇందులో బాస్మతి మొదటి స్థానంలో నిలవగా, ఇటలీకి చెందిన అర్బోరియో రెండో స్థానంలో, పోర్చుగల్‌కు చెందిన కరోలినా రైస్ మూడో స్థానంలో నిలిచాయి. బాస్మతి అన్నం, అద్భుతమైన సువాసన, రుచి, పొడవైన ఆకారం ఉన్నప్పటికీ, ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. భారతీయ బాస్మతిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. పులావ్ అయినా, బిర్యానీ అయినా, బాస్మతి భారతీయులకు ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు భారత్‌ బాస్మతి బియ్యాన్ని సరఫరా చేస్తుంది. దీనిని మనదేశంలోని హిమాలయాల్లో మాత్రమే పండిస్తారు. అయితే దీనిని పాకిస్తాన్‌లో కూడా సాగు చేస్తారు. ఎగుమతి పరంగా చూస్తే బాస్మతీ ఎగమతిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.

2021లో రక్షిత భౌగోళిక సూచిక (PGI) ట్యాగ్ కోసం భారతదేశం యూరోపియన్ యూనియన్‌కు దరఖాస్తు చేసినప్పుడు, పాకిస్తాన్ నిరసన తెలిపింది. ఇదే జరిగితే తమ మార్కెట్‌ను కోల్పోతామని పాకిస్థాన్‌ భయపడింది. బాస్మతిని ఎగుమతి చేయడం ద్వారా భారత్‌ ప్రతి యేట 6.8 బిలియన్ డాలర్లను అర్జిస్తోంది. పాకిస్తాన్‌లో 2.2 బిలియన్ డాలర్లు మాత్రమే అర్జిస్తోంది.

బాస్మతి చరిత్ర తెలుసా..

బాస్మతి అనే పదం వాస్, మయాప్‌ అనే సంస్కృత పదాల కలయిక వలన రూపొందింది. వాస్ అంటే సువాసన, మయాప్ అంటే లోతు. అయితే ఇందులో వాడబడిన మతి అనే పదానికి రాణి అనే అర్థం కూడా ఉంది. అందుకే దీనిని సువాసనల రాణి అని పిలుస్తారు. విశేషమేమిటంటే.. సువాసనకు పేరుగాంచిన దీన్ని తయారుచేసిన వెంటనే ఆ వాసన పరిసరాలకు వ్యాపిస్తుంది. హిమాలయాల దిగువ ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్‌లలో బాస్మతిని ఎక్కువగా పండిస్తారు. ప్రాచీన భారత దేశంలో కూడా బాస్మతి పండించినట్లు చారిత్రక పత్రాలు చూపిస్తున్నాయి. ఆహారంపై రాసిన ఆరోమాటిక్ రైసెస్ అనే పుస్తకం ప్రకారం.. హరప్పా-మొహెంజొదారో త్రవ్వకాలలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయి. పెర్షియన్ వ్యాపారులు వ్యాపారం కోసం భారతదేశానికి చేరుకున్నప్పుడు, వారు తమతో పాటు అనేక రకాల సుగంధ బియ్యాన్ని తీసుకువచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. భారతీయ వ్యాపారులు 1766లో మధ్యప్రాచ్య దేశాలకు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయడం ప్రారంభించినట్లు చరిత్ర గ్రంధాలు తెల్పుతున్నాయి. భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ దేశాలు కూడా ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యమత్ వంటి అనేక దేశాలకు భారత్‌ గరిష్టంగా బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

అన్ని రకాల సుగంధ బియ్యం బాస్మతి కాదు.. వాటిల్లో తేడా ఇదే

బాస్మతి దాని సువాసన ద్వారా కూడా గుర్తిస్తారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సువాసన కలిగిన పొడవైన బియ్యం అన్నీ బాస్మతి కాదు. బాస్మతి ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ బాస్మతి బియ్యం అసలైనదో కాదో టెస్ట్ చేసి నిర్ణయిస్తుంది. ఈ సంస్థ DNA పరీక్ష ద్వారా దీనిని నిర్ధారిస్తుంది. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకారం.. 6.61 మిమీ పొడవు, 2 మిమీ మందం ఉన్న బియ్యాన్ని బాస్మతిగా పేర్కొంటారు. డెహ్రాడూన్‌లో పండించే ఈ ప్రత్యేక బియ్యాన్ని డెహ్రాడూన్ బాస్మతి అని కూడా పిలుస్తారు. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకారం.. భారతదేశంలో బాస్మతిలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో బాస్మతి 217, బాస్మతి 370, టైప్ 3 (డెహ్రాడూన్ బాస్మతి), పంజాబీ బాస్మతి 1, పూసా బాస్మతి 1, కస్తూరి, హర్యానా బాస్మతి 1, మహి సుగంధ్, తారావోరి బాస్మతి (HBC 19 / కర్నాల్ లోకల్), రణబీర్ బాస్మతి, బాస్మతి 386 ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..