Republic Day 2024: జైపూర్ చేరుకున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్.. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రోడ్ షో

రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం జైపూర్ చేరుకున్నారు. రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, సీఎం భజన్‌లాల్ శర్మ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలకు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మాక్రాన్ తన పర్యటనను జైపూర్‌లోని అమెర్ ఫోర్ట్ నుండి ప్రారంభించారు.

Republic Day 2024: జైపూర్ చేరుకున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్.. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రోడ్ షో
PM Modi and French President Macron
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 25, 2024 | 6:33 PM

రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం జైపూర్ చేరుకున్నారు. రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, సీఎం భజన్‌లాల్ శర్మ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలకు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మాక్రాన్ తన పర్యటనను జైపూర్‌లోని అమెర్ ఫోర్ట్ నుండి ప్రారంభించారు. ఆ తర్వాత ప్రపంచ వారసత్వ ప్రదేశం జంతర్ మంతర్‌కు వెళ్లి అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

ఫ్రెంచ్ వారికి కూడా చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతాన్ని ఇరువురు నేతలు మోదీ, మాక్రాన్ సందర్శించారు. జంతర్ మంతర్ ప్రపంచంలోనే అతి పెద్ద అబ్జర్వేటరీ. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సూర్య గడియారం ఇక్కడే ఉంది. పండితుడు ధ్రువ్ రైనా ప్రకారం, 1734లో పశ్చిమ బెంగాల్‌లోని చందర్‌నాగోర్ (ప్రస్తుతం చందన్‌నగర్)లోని జెస్యూట్ మిషన్‌లో ఉన్న ఇద్దరు ఫ్రెంచ్ జెస్యూట్ ఖగోళ శాస్త్రవేత్తలు జైపూర్ వ్యవస్థాపకుడు, పాలకుడు సవాయి జై సింగ్ ఆస్థానానికి ఆహ్వానించారు. వీరి సహాయంతో సవాయ్ జై సింగ్ 19 ఖగోళ పరికరాల సమాహారంతో జంతర్ మంతర్‌ను నిర్మించారు.

చర్చిస్తారు. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర సహకారాన్ని పెంచడం, ఎర్ర సముద్రంలో పరిస్థితి, హమాస్-ఇజ్రాయెల్ వివాదం, ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, మాక్రాన్ చర్చిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత జంతర్ మంతర్ నుంచి సంగనేరి గేట్ వరకు ప్రధాని మోదీ, మాక్రాన్ ఉమ్మడి రోడ్ షోను నిర్వహించి, హవా మహల్ చేరుకుంటారు. హవా మహల్‌లో ఫోటో సెషన్ ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ, మాక్రాన్ ఇద్దరూ హస్తకళల దుకాణం, టీ దుకాణాన్ని సందర్శించే అవకాశం ఉంది. అనంతరం ఇరువురు నేతలు చారిత్రక ఆల్బర్ట్ హాల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. అనంతరం రాంబాగ్ ప్యాలెస్‌లో మాక్రాన్ పర్యటన ముగుస్తుంది, అక్కడ ప్రధాని మోదీ మాక్రాన్‌కు ప్రైవేట్ విందును ఏర్పాటు చేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవ పరేడ్‌ కోసం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు రాత్రి 8.50 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో ఫ్రెంచ్ సైన్యానికి చెందిన బృందం పాల్గొంటోంది. ఫ్రెంచ్ వైమానిక దళానికి చెందిన రెండు రాఫెల్ యుద్ధ విమానాలు, ఎయిర్‌బస్ A330 మల్టీ-రోల్ ట్యాంకర్ రవాణా విమానం కూడా పరేడ్‌లో పాల్గొంటాయి. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆరో ఫ్రెంచ్ నాయకుడు మాక్రాన్. దీనికి ముందు 2016లో అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, 2008లో నికోలస్ సర్కోజీ, 1998లో జాక్వెస్ చిరాక్, వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, 1980లో 1976, భారత గణతంత్ర దినోత్సవానికి ప్రధాన మంత్రి జాక్వెస్ చిరాక్ ముఖ్య అతిథిగా వచ్చారు.

పరేడ్ అనంతరం మాక్రాన్ ఫ్రెంచ్ ఎంబసీకి వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడనున్నారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌హోమ్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్ – ఫ్రాన్స్‌ల దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాక్రాన్ పర్యటన జరుగుతోంది. రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో ఇరుపక్షాల మధ్య ప్రధాన ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. మాక్రాన్‌తో పాటు పలువురు మంత్రులు, CEO లు, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన ప్రతినిధి బృందం కూడా భారతదేశానికి వస్తోంది.

గత ఏడాది జూలై 14న ప్యారిస్‌లో నిర్వహించిన ‘బాస్టిల్’ డే పరేడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. జీ20 సదస్సులో పాల్గొనేందుకు అధ్యక్షుడు మాక్రాన్ గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌కు వచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…