Gold Mine: మాలిలో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మంది మృతి.. కొనసాగుతున్న సహాయ చర్యలు

గనుల మంత్రిత్వ శాఖ మంగళవారం ఈ ఘటనపై ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈ దారుణ ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువగా మైనర్లు ఉన్నట్లు వెల్లడించారు.  బంగారు గని కుప్పకూలిన సమయంలో అందులో 150 నుంచి 100 మంది వరకు ఉన్నట్లు.. గనిలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. ఆఫ్రికాలోని మూడవ అతిపెద్ద బంగారు ఉత్పత్తి దేశమైన మాలిలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణం.

Gold Mine: మాలిలో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మంది మృతి.. కొనసాగుతున్న సహాయ చర్యలు
Gold Mines Collapse
Follow us
Surya Kala

|

Updated on: Jan 25, 2024 | 9:37 AM

మాలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగారు గని కూలి 70 మందికి పైగా మరణించారు. గనిలో చిక్కుకున్నవారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఈ మృతుల సంఖ్య మరింత పెరుగనుందని తెలుస్తోంది. మాలిలోని నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో గోల్డ్ మైన్ తవ్వుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడ ప్రభుత్వ జాతీయ జియాలజీ అండ్ మైనింగ్ డైరెక్టరేట్‌లోని సీనియర్ అధికారి కరీమ్ బార్తే తెలిపారు. అంతేకాదు నాలుగు రోజుల క్రితమే ఈ దారుణం జరిగినట్లు ధృవీకరించారు.

మీడియా కథనాల ప్రకారంగత శుక్రవారం సంభవించిన ప్రమాదానికి కారణమేమిటో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. గనుల మంత్రిత్వ శాఖ మంగళవారం ఈ ఘటనపై ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈ దారుణ ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువగా మైనర్లు ఉన్నట్లు వెల్లడించారు.  బంగారు గని కుప్పకూలిన సమయంలో అందులో 150 నుంచి 100 మంది వరకు ఉన్నట్లు.. గనిలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు.

మాలిలో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం

ఆఫ్రికాలోని మూడవ అతిపెద్ద బంగారు ఉత్పత్తి దేశమైన మాలిలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణం. దీంతో గోల్డ్ మైన్స్ తవ్వే సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై తరచుగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అధికారులు భద్రతా చర్యలను విస్మరిస్తున్నారని తరచుగా ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రాష్ట్రం ఈ ఆర్టిసానల్ మైనింగ్ రంగంలో ఆర్డర్ తీసుకురావాలని బార్తే అన్నారు. గనుల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మైనర్లు,  మైనింగ్ సైట్ల సమీపంలో నివసిస్తున్న కమ్యూనిటీలు భద్రతా అవసరాలు పాటించాలని కోరింది.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటి మాలి.. అయితే ఆఫ్రికాలో బంగారు ఉత్పత్తిలో మొదటి ప్లేస్ లో మాలి నిలుస్తుంది. ఈ దేశంలో 10శాతం కంటే ఎక్కువ మంది ఆదాయంకోసం మైనింగ్ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..