Ayodhya: గర్భాలయం కోసం చెక్కిన మూడో విగ్రహం లుక్ రివీల్.. దీనిని ఎక్కడ ఉంచుతారంటే..

మూడింటిలో ఒకటి తెల్లటి పాల రాతి విగ్రహం. మూడో రాముడి విగ్రహం కూడా  వెల్లడైంది. ఈ విగ్రహంలోనూ.. రాముడు బాలుడు రూపంలో చెక్కబడ్డాడు. ఈ విగ్రహాన్ని కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన శిల్పకారుడే చెక్కడం విశేషం. బెంగళూరుకు చెందిన శిల్పి జిఎస్ భట్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఆలయ ప్రాంగణంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిని ఆలయంలో ఎక్కడ, ఏ అంతస్తులో ఏర్పాటు చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పాదయాత్ర ఏరియా కమిటీ ఈ నిర్ణయం తీసుకోనుంది. 

Ayodhya: గర్భాలయం కోసం చెక్కిన మూడో విగ్రహం లుక్ రివీల్.. దీనిని ఎక్కడ ఉంచుతారంటే..
Third Idol Rama
Follow us
Surya Kala

|

Updated on: Jan 25, 2024 | 8:23 AM

అయోధ్యలోని రామాలయంలో ప్రతిష్ఠించడానికి మూడు విగ్రహాలను ముగ్గురు శిల్పులు చెక్కారు. అయితే కర్ణాటక మైసూర్ కు చెందిన యోగిరాజ్ చెక్కిన బాల రామయ్య గర్భాలయంలో ప్రాణ ప్రతిష్ట కోసం ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు విగ్రహాలు ఎలా  ఉన్నాయి.. అవి ఎక్కడ ప్రతిష్టంచనున్నారు అనే ఆసక్తి భక్తులకు ఏర్పడింది. మూడింటిలో ఒకటి తెల్లటి పాల రాతి విగ్రహం. మూడో రాముడి విగ్రహం కూడా  వెల్లడైంది. ఈ విగ్రహంలోనూ.. రాముడు బాలుడు రూపంలో చెక్కబడ్డాడు. ఈ విగ్రహాన్ని కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన శిల్పకారుడే చెక్కడం విశేషం. బెంగళూరుకు చెందిన శిల్పి జిఎస్ భట్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఆలయ ప్రాంగణంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిని ఆలయంలో ఎక్కడ, ఏ అంతస్తులో ఏర్పాటు చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పాదయాత్ర ఏరియా కమిటీ ఈ నిర్ణయం తీసుకోనుంది. 

గర్భగుడిలో ప్రతిష్టించడానికి తయారు చేసిన మూడు విగ్రహాలలో ఇది మూడవ విగ్రహం. అంతకుముందు, తెల్లటి రంగులో ఉన్న శ్రీరాముడి విగ్రహం బహిర్గతమైంది. ఆలయ మొదటి అంతస్తులో తెలుపు రంగు విగ్రహాన్ని ప్రతిష్టించవచ్చు. అదే సమయంలో ఈ కొత్త విగ్రహాన్ని స్థాపించే స్థలం ఇంకా నిర్ణయించబడలేదు.

నలుపు రంగులో ఉన్న మూడవ విగ్రహం

ఇవి కూడా చదవండి

బయటకు వచ్చిన మూడో విగ్రహంలో కూడా రామ్ లాల్ నలుపు రంగులో కనిపిస్తున్నారు. కుడిచేతిలో బాణం, ఎడమచేతిలో విల్లు ధరించి కనిపిస్తున్నారు. గర్భ గుడిలోని బాల రామయ్య చేతిలో కనిపిస్తున్న విల్లు, బాణం బంగారంతో ఉన్నాయి. అయితే ఈ విగ్రహంలో విల్లు, బాణం కూడా నలుపు రంగులో కనిపిస్తున్నాయి. 

గర్భగుడిలో ఏర్పాటు చేసిన విగ్రహానికి, ఈ కొత్త విగ్రహానికి పెద్దగా తేడా కనిపించకపోవడం గమనార్హం. విగ్రహం మొత్తం నలుపు రంగులోనే కనిపిస్తోంది. బాల చంద్రుడి నగలు కూడా నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

రెండవ విగ్రహం ఎలా ఉంది?

ఆలయంలో ప్రతిష్టించబడిన రెండవ విగ్రహం తెలుపు రంగులో ఉంటుంది. ఈ విగ్రహాన్ని శిల్పి సత్య నారాయణ్ పాండే రూపొందించారు. ఈ విగ్రహంలోనూ రాముడి పాదాల దగ్గర హనుమంతుడు ఉన్నాడు. అదే సమయంలో.. విగ్రహంలో పరశురాముడు, గౌతమ బుద్ధుడు కూడా కనిపిస్తారు. ఈ విగ్రహంలో రాముడి ఆభరణాలు బంగారు వర్ణంలో కనిపిస్తాయి.

భక్తుల రద్దీ నెలకొంది

ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజే లక్షలాది మంది భక్తులు రామ్ లల్లా దర్శనం కోసం ఆలయానికి చేరుకున్నారు. అధికారిక సమాచారం ప్రకారం మొదటి రోజు దాదాపు 6 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. భారీ సంఖ్యలో ఉన్న భక్తులను అదుపు చేసేందుకు అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. కొన్ని రోజుల వరకూ అయోధ్యకు రావద్దు అంటూ అధికారులు ఒక నోటిఫికేషన్ ను కూడా జారీ చేశారు. 

ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి

అయితే రామ మందిర నిర్మాణ పనులు ఇంకా చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ మందిర గర్భగుడి, ఆలయ  మొదటి అంతస్తు మాత్రమే పూర్తయింది. రెండు, మూడో అంతస్తులు ఇంకా నిర్మించాల్సి ఉంది. ఆలయ శిఖరం నిర్మాణం కూడా ఇంకా పూర్తి కాలేదు. శ్రీ రామమందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకారం, ఆలయ ప్రాంగణంలో గణేశుడు,  శబరి సహా అనేక ఇతర ఆలయాలు ఇంకా నిర్మించాల్సి ఉంది. ఆలయం పూర్తిగా 2024 ఏడాది చివరికి పూర్తి అవుతుందని.. ఇంకా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..