AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: బాల రామయ్య దర్శనానికి బారులు తీరిన భక్తులు.. దర్శన సమయం పెంచిన అధికారులు

ఇంతకుముందు ఉదయం 7 నుండి 11.30  మళ్ళీ  మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు రామయ్య దర్శనం కోసం సమయం కేటాయించాయి. అయితే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దర్శన సమయాన్ని మార్చినట్లు.. ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు బాల రామయ్య దర్శనం చేసుకోవచ్చు అని వెల్లడించారు. పొగమంచుతో కూడిన తీవ్రమైన చలిని తట్టుకుని.. ఉదయం నుండి ప్రజలు రామ్‌పథం, ప్రధాన రహదారి, ఆలయ ప్రాంగణం చుట్టూ భారీగా భక్తులు క్యూల్లో నిలబడ్డారు. "క్యూలలో ఉన్న వృద్ధులు, పిల్లలు, మహిళలను ప్రత్యేకంగా పరిగణించాలని సందర్శకుల మనోభావాలకు అనుగుణంగా ప్రధాన రహదారులపై తక్కువ సంఖ్యలో రామభజన కార్యక్రమాలు చేయాలని సూచించారు. 

Ayodhya: బాల రామయ్య దర్శనానికి బారులు తీరిన భక్తులు.. దర్శన సమయం పెంచిన అధికారులు
Ayodhya Ram Mandir
Surya Kala
|

Updated on: Jan 25, 2024 | 7:21 AM

Share

అయోధ్యలోని బాల రామయ్యను బుధవారం 2.5 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన తొలిరోజే రూ.3.17 కోట్ల విరాళాలు లభించినట్లు వెల్లడించారు. ఆలయంలో నెలకొన్న భక్తుల రద్దీ మధ్య, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. రద్దీ నిర్వహణ కోసం తీసుకున్న చర్యలను సమీక్షించారు. అంతేకాదు ఎవరైనా సెలబ్రెటీలు ఆలయాన్ని సందర్శించాలనుకుంటే ఆ విషయాన్నీ ముందుగానే అధికారులకు తెలియజేయాలని VIPలకు సూచించారు. అంతేకాదు ఎవరైనా సెలబ్రెటీలు రామయ్యను దర్శించుకోవాలనుకుంటే ఒక వారం రోజుల ముందు తమ సందర్శన సమాచారం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు తెలియజేయాలని సూచించారు.

జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ మాట్లాడుతూ  సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత రెండవ రోజు బుధవారం రాత్రి 10 గంటల వరకు 2.5 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు. తొలిరోజే 5 లక్షల మందికి పైగా ఆలయాన్ని సందర్శించారని తెలిపారు. ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత తెరిచిన 10 కౌంటర్లలో ఆన్‌లైన్ మోడ్ ద్వారా భక్తులు ఒక్కరోజులో మొత్తం రూ.3.17 కోట్ల విరాళాలు అందించారని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టు అనిల్ మిశ్రా తెలిపారు.

భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు దర్శన సమయాలను పొడిగించినందున అత్యధిక సంఖ్యలో భక్తులకు వసతి కల్పిస్తున్నట్లు  ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతకుముందు ఉదయం 7 నుండి 11.30  మళ్ళీ  మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు రామయ్య దర్శనం కోసం సమయం కేటాయించాయి. అయితే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దర్శన సమయాన్ని మార్చినట్లు.. ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు బాల రామయ్య దర్శనం చేసుకోవచ్చు అని వెల్లడించారు. పొగమంచుతో కూడిన తీవ్రమైన చలిని తట్టుకుని.. ఉదయం నుండి ప్రజలు రామ్‌పథం, ప్రధాన రహదారి, ఆలయ ప్రాంగణం చుట్టూ భారీగా భక్తులు క్యూల్లో నిలబడ్డారు. “క్యూలలో ఉన్న వృద్ధులు, పిల్లలు, మహిళలను ప్రత్యేకంగా పరిగణించాలని సందర్శకుల మనోభావాలకు అనుగుణంగా ప్రధాన రహదారులపై తక్కువ సంఖ్యలో రామభజన కార్యక్రమాలు చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు వివిధ ప్రాంతాల్లో తాగునీటి వసతి ఉండేలా చూడాలని, వృద్ధులు, వికలాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని ఆదిత్యనాథ్ అధికారులను కోరారు. చలి నుంచి రక్షణ కోసం  మంటలను ఏర్పాటు చేయాలని.. శీతల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రామపథం, భక్తిమార్గం, ధర్మపథం, జన్మభూమి మార్గంలో జూట్‌ మ్యాట్‌లు వేయాలని ఆదేశించారు. “దర్శనం, పూజల తర్వాత భక్తులు వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు భద్రత, సౌకర్యాన్ని కల్పించడానికి పరిపాలన అధికారులు, పోలీసులు సర్వసన్నద్ధమయ్యారు’ అని ప్రకటనలో పేర్కొంది. ఆలయ ప్రాంగణం వెలుపల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బృందాలు మోహరించాయి. ఆలయం వద్ద  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయోధ్య క్షేత్రంలోని ప్రవేశించే వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. బస్తీ, గోండా, అంబేద్కర్‌నగర్, బారాబంకి, సుల్తాన్‌పూర్, అమేథీ నుండి అన్ని రహదారులను అయోధ్యతో సరిహద్దుల నుండి 15 కిలోమీటర్ల ముందు బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..