AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైన్స్‌కు సవాల్ ఈ ఆలయం.. మీరు నమ్మండి.. లేదా నమ్మకపోండి.. అర్ధరాత్రి ఈ ఆలయంలోని విగ్రహాలు మాట్లాడుకుంటాయట..

నేటికీ మిస్టరీ వీడని ఒక ఆలయం బీహార్‌లోని బస్తర్‌ జిల్లాలో ఉంది. ఇక్కడ ఉన్న రాజరాజేశ్వరి త్రిపుర సుందరి దేవి ఆలయానికి ప్రజలు భారీగా వస్తారు. కోరిన కోర్కెలు తీర్చేదేవతగా భావించి పూజిస్తారు. ఈ  త్రిపుర సుందరి ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలున్నాయి. ఇతర దేవుళ్ళ, దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని స్థానికులు చెబుతారు. 

సైన్స్‌కు సవాల్ ఈ ఆలయం.. మీరు నమ్మండి.. లేదా నమ్మకపోండి.. అర్ధరాత్రి ఈ ఆలయంలోని విగ్రహాలు మాట్లాడుకుంటాయట..
Tripura Sundari Temple
Surya Kala
|

Updated on: Jan 25, 2024 | 10:59 AM

Share

భారతదేశం ఆధ్యాత్మిక ప్రదేశం. అనేక రహస్యాలు నెలవు. సైన్స్ కు సవాల్ చేస్తూ ఎన్నో రహస్యాలను దాచుకున్న ప్రసిద్ధ దేవాలయాలున్నాయి. బీహార్ నలంద విశ్వవిద్యాలయానికి నిలయం మాత్రమే కాదు.. ఈ  పవిత్ర భూమిలో అనేక పురాతన రహస్య దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలు తమలో దాచుకున్న  రహస్య కథల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. నేటికీ మిస్టరీ వీడని ఒక ఆలయం బీహార్‌లోని బస్తర్‌ జిల్లాలో ఉంది. ఇక్కడ ఉన్న రాజరాజేశ్వరి త్రిపుర సుందరి దేవి ఆలయానికి ప్రజలు భారీగా వస్తారు. కోరిన కోర్కెలు తీర్చేదేవతగా భావించి పూజిస్తారు. ఈ  త్రిపుర సుందరి ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలున్నాయి. ఇతర దేవుళ్ళ, దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని స్థానికులు చెబుతారు.

పురాణాల విశ్వాసాల ప్రకారం త్రిపుర సుందరి ఆలయ ప్రస్తావన వస్తే.. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని చెబుతారు. దీనికి చెందిన రహస్యాన్ని ఇప్పటి వరకూ ఎవరూ ఛేదించలేకపోయారట. ముఖ్యంగా ప్రతి అమావాస్య అర్ధరాత్రి ఈ ఆలయం నుండి కొన్ని శబ్దాలు వస్తాయని ఇక్కడి స్థానికులు చెబుతారు. కొంత సమయం ఆ శబ్దాలను బాగా వింటే.. ఈ శబ్దాలు విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం వలన వస్తున్నాయని తేలిందట.

శాస్త్రవేత్తలు కూడా ఛేదించని మిస్టరీ

త్రిపుర సుందరి ఆలయంలో విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయన్న విషయం క్రమంగా ప్రజలోకి వెళ్ళింది. ఈ విషయంపై చర్చ జరగడం ప్రారంభమైంది. దీంతో రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి పరిశోధన ప్రారంభించారు. అయితే ఎన్ని రకాలుగా పరిశోధనలు చేసినా అమావాస్య అర్ధరాత్రి విగ్రహాల నుంచి వచ్చే ఆ స్వరాల రహస్యాన్ని కనుగొనలేకపోయారు. ఈ రహస్యాన్ని ఛేదించాలానే పట్టుదలతో అనేక రకాలుగా ప్రయత్నించారు. అయితే రహస్యం తెలుసుకునేందుకు చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు.

ఇవి కూడా చదవండి

విగ్రహాల్లో జీవం

త్రిపుర సుందరి ఆలయం సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగి  ఉంది. తాంత్రిక శక్తి కలిగిన భవానీ మిశ్రా ఈ ఆలయంలో దేవతలు, దేవతల విగ్రహాలను ప్రతిష్టించారు. ఇందుకోసం ఆయన కఠోరమైన తపస్సు చేసారని చెబుతారు. ఆయన తపస్సు కారణంగా విగ్రహాల్లో జీవం వచ్చిందని.. అప్పటి నుండి ఈ విగ్రహాలు ఏదైనా ప్రత్యేక సందర్భంలో రాత్రిపూట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారని స్తానికుల నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..