Ram Mandir: ఆ దేశంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ సంబరాలు.. భారతీయులపై శిక్ష విధించిన అధికారులు..

అయోధ్యలో శ్రీ బాల రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు సంబరాలు చేసుకున్నారు. అందులో భాగంగానే గల్ఫ్ దేశాలలో ఉన్న లక్షలాది మంది భారతీయులు శ్రీరాముణ్ణి పూజిస్తూ ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు జరుపుకున్నారు. అయోధ్య ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ కన్నుల నిండుగా శ్రీరాముడిని నింపుకున్నారు.

Ram Mandir: ఆ దేశంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ సంబరాలు.. భారతీయులపై శిక్ష విధించిన అధికారులు..
Kuwait
Follow us
Srikar T

|

Updated on: Jan 26, 2024 | 12:30 PM

అయోధ్యలో శ్రీ బాల రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు సంబరాలు చేసుకున్నారు. అందులో భాగంగానే గల్ఫ్ దేశాలలో ఉన్న లక్షలాది మంది భారతీయులు శ్రీరాముణ్ణి పూజిస్తూ ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు జరుపుకున్నారు. అయోధ్య ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ కన్నుల నిండుగా శ్రీరాముడిని నింపుకున్నారు. అయితే మరి కొందరు మాత్రం భక్తిని అధికమోతాదులో చూపిందిచ చిక్కుల్లో పడ్డారు. కువైత్‌లోని ఒక ప్రముఖ మల్టీనేషన్ పెట్రో రసాయనాల సంస్థకు అనుబంధంగా కొందరు భారతీయులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీరు ప్రాణ ప్రతిష్ఠ రోజున అక్కడి స్థానిక చట్టాలను ఉల్లంఘించి వేడుకలు జరుపుకున్నారు. దీంతో అక్కడి సంస్థ యాజమాన్యం వీరిపై విచారణను ఆదేశించింది. ప్రస్తుతం వేడుకలపై వివరణ ఇవ్వాలంటూ విచారణ ఎదుర్కొంటున్నారు.

శ్రీరామనామ స్మరణతో పాటు ఇతర భావోద్వేగ నినాదాలు చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. ఇలా చేసినందుకు 9 మంది భారతీయులను అరెస్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. వారి వీసాలను రద్దు చేసి తమ దేశం నుండి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా అదే రోజు రాత్రి విమానంలో భారతదేశానికి పంపారు. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది ఎవరు, కేకులు తీసుకొచ్చిన వారు ఎవరు? సంబరాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నదెవరనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనలో తెలుగు వారెవరూ లేరనేది ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం. దీనిపై కువైత్‌లోని భారతీయ రాయబార కార్యాలయం స్పందించింది. అక్కడి పరిస్థితిని అందులో పాల్గొన్న వారి వివరాలను తెలియజేయవల్సిందిగా కువైత్ ప్రభుత్వాన్ని కోరింది.

పాలస్తీనాపై దాడుల నేపథ్యంలో అక్కడి వారికి సంఘీభావంగా కువైత్ తమ దేశంలో అన్ని రకాల వేడుకల నిర్వహణను నిషేధించింది. దీనికి తోడుగా కువైత్ రాజు (అమీర్) షేఖ్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సభా డిసెంబర్ 16న మరణించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంతాపం అమలులో ఉంది. ఇలాంటి కీలకమైన ఆదేశాలను ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులకు దారి తీసింది. ఈ వ్యవహారంలో భాగంగానే భారతీయులపై శిక్ష విధించారని భావిస్తున్నారు. కువైత్‌లో దాదాపు 9 లక్షల మంది భారతీయులున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందులో మలయాళీల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని  రాయలసీమ జిల్లాలకు చెందిన వారే అధిక సంఖ్యలో ఉన్నారు. గతంలో సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించినందుకు కొందరు భారతీయులకు జైలు శిక్ష విధించారు. అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ దీనిపై ఎంతగా ప్రయత్నించినా వారిపై కేసులు కొట్టివేయడంలో సఫలం కాలేక పోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..