70 ఏళ్ల తర్వాత సౌదీలో తెరుచుకోనున్న మద్యం దుకాణాలు.. కారణం ఏంటంటే..
ఇస్లాంకు కంచుకోట అయిన సౌదీలో 70 ఏళ్ల క్రితం నాటి నుంచి మద్యం పానాన్ని నిషేధించారు. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత సౌదీలో తిరిగి మద్యం అందుబాటులోకి రానుంది. రియాద్‌లో మద్యం దుకాణాలను ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. అయితే ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి...
ప్రంచంలో మద్యం నిషేధం ఉన్న దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ఇస్లాంకు కంచుకోట అయిన సౌదీలో 70 ఏళ్ల క్రితం నాటి నుంచి మద్యం పానాన్ని నిషేధించారు. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత సౌదీలో తిరిగి మద్యం అందుబాటులోకి రానుంది. రియాద్‌లో మద్యం దుకాణాలను ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. అయితే ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి.ఇంతకీ ఏంటా కండిషన్స్.? ఇన్నేళ్లు సౌదీలో మద్యం నిషేధానికి కారణం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
70 ఏళ్ల తర్వాత సౌదీలో మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇది కేవలం ఎంపిక చేసిన కొందరు ముస్లిమేతరుల కోసమే. ఈ మద్యం కేవలం దౌత్య సిబ్బందికే మాత్రమే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు, దౌత్య సిబ్బంది కోసం సీల్డ్ ప్యాకేజీలలో మద్యం సౌదీకి దిగుమతి అయ్యేది, దీనినే డిప్లొమాటిక్ పర్సు అంటారు. వార్తా ఏజెన్సీల ప్రకారం, కొత్త స్టోర్ రియాద్‌లోని డిప్లమాటిక్ క్వార్టర్‌లో ఉండనుంది.
ఇక సౌదీలో మద్యాన్ని ఎందుకు నిషేధించారో ఇప్పుడ తెలుసుకుందాం.. ఇస్లాంలో మద్యాన్ని నిషిద్ధంగా ప్రస్తావించారు. మద్యాన్ని నిషేధించిన దేశాల్లో గల్ఫ్, కువైట్, షార్జాలతో పాటు సౌదీ కూడా ఉంది. సౌదీలో 1852లో మద్యాన్ని నిషేధించారు. దీని వెనక ఒక కథ ఉంది.. మద్యం సేవిస్తున్న సమయంలో జరిగిన ఓ గొడవలో.. అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్ అజీజ్.. కుమారుడు ప్రిన్స్ మిషారీ బ్రిటీష్ దౌత్యవేత్త సిరిల్ ఉస్మాన్‌ను జెడ్డాను కాల్చి చంపారు. దీంతో ఆ సమయం నుంచి మద్యంపై దేశంలో పూర్తిగా నిషేధం విధించారు. ఈ కేసులో చక్రవరి కుమారుడిని దోషిగా ప్రకటించారు.
కాలక్రమేణా, సౌదీ అరేబియా కుటుంబం యొక్క భావజాలం మరింత తీవ్రంగా మారింది దీంతో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తూ వచ్చారు. అయితే తాజాగా సౌదీ అరేబియాలో ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తమ దేశ ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో మార్పులు చేస్తూ వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం చమురుపై మాత్రమే ఆధారపడ్డ ఆ దేశం ఇప్పుడు పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మద్యానికి తిరిగి అనుమతి ఇచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే మద్య నిషేధం విధించిన కొన్ని ఇస్లామిక్ దేశాల్లో ఈ నిబంధనను అతిక్రమిస్తే.. కఠిన శిక్షలను విధిస్తుంటాయి. జరిమానాలు విధించడం, జైలు శిక్ష విధించడం, బహిరంగంగా కొరడాలతో కొట్టడం, విదేశాల నుంచి వచ్చిన వారిని వారి దేశాలకు పంపించేయడం వంటి నియమాలు ఉన్నాయి. అయితే తాజా సౌదీ కాస్త ఉపశమనం కల్పించే దిశగా అడుగుగులు వేస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..