AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamdev Jatara: నువ్వుల నూనె మహా ప్రసాదం.. కిలోల నువ్వుల నూనెను నీళ్లలా తాగేసి తొడసం వంశీయురాలు

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండల కేంద్రంలో కొలువుదీరిన ఖాందేవ్‌ జాతర తొడసం వంశీయుల ఆధ్వర్యంలో ఈ నెల 24న ప్రారంభమైంది‌. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏటా పుష్యమాసంలో ఖాందేవ్‌ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఖాందేవ్ జాతర ముగియగానే ఆదివాసీలంతా నాగోబా జాతరకు బయలుదేరడం ఆనవాయితి.

Kamdev Jatara: నువ్వుల నూనె మహా ప్రసాదం.. కిలోల నువ్వుల నూనెను నీళ్లలా తాగేసి తొడసం వంశీయురాలు
Woman Drinking Oil
Naresh Gollana
| Edited By: Surya Kala|

Updated on: Jan 27, 2024 | 10:07 AM

Share

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండల కేంద్రంలో తొడసం వంశస్తుల ఆరాధ్య దైవం ఖాందేవ్‌ జాతర వైభవంగా జరుగుతోంది. పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా ఏటా తొడసం వంశస్తులు ఖాందేవ్‌ జాతర నిర్వహిస్తారు. సంప్రదాయ డోలు వాయిద్యాలతో శుక్రవారం మహాపూజ నిర్వహించారు. నిష్టగా ఇళ్లలోనే తయారు చేసిన నువ్వుల నూనెను రెండో రోజున ఆలయానికి తీసుకువచ్చి ఖాందేవ్‌కు నైవేద్యంగా సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించారు. తొడసం వంశానికి చెందిన ఆడపడుచు ఈ నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

ఈ ఏడాది తొడసం వంశీయురాలైన ఆడపడుచు మేస్రం నాగుబాయి చందు (52) రెండున్నర లీటర్ల నువ్వుల నూనెను తాగి మొక్కు తీర్చుకున్నారు. జాతరలో ఇలా నువ్వుల నూనె తాగడం ఆచారంగా వస్తోంది. ఇలా మొక్కు చెల్లించుకోవడం వలన సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని ఆదివాసీల అపార నమ్మకం. శతాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోందని ఖాందేవ్‌ ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు తెలిపారు.

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండల కేంద్రంలో కొలువుదీరిన ఖాందేవ్‌ జాతర తొడసం వంశీయుల ఆధ్వర్యంలో ఈ నెల 24న ప్రారంభమైంది‌. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏటా పుష్యమాసంలో ఖాందేవ్‌ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఖాందేవ్ జాతర ముగియగానే ఆదివాసీలంతా నాగోబా జాతరకు బయలుదేరడం ఆనవాయితి.

ఈ నెల24 న మాన్కాపూర్‌లోని గోవర్ధన్‌గుట్ట వద్ద తొడసం వంశస్తులు కుటుంబసమేతంగా బస చేసి… మైసమాల్‌ దేవతకు సంప్రదాయ పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి 25న ఖాందేవ్‌ ఆలయానికి చేరుకొని… అర్ధరాత్రి తొడసం వంశీయులు దేవతల ప్రతిమలకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేశారు.

సంస్కృతీ సంప్రదాయాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ప్రారంభించారు. 26న ఆ వంశం ఆడబిడ్డ పవిత్రమైన నువ్వుల తైలం తాగి మొక్కు తీర్చుకుంది. ఈ జాతర 15 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగనున్నది. జాతర సందర్భంగా క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌ పోటీలను నిర్వహిస్తున్నారు నిర్వహకులు..

తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉమ్మడి జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకోనున్నారు. తైలం తాగే మహోత్సవాన్ని తిలకించేందుకు ప్రముఖులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మద్యాహ్నం ఆలయ ప్రాంగణంలో మినీ దర్బార్‌ నిర్వాహించారు నిర్వహకులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.