Sunday Puja Tips: జాతకంలో దోషమా సూర్యభగవానుడిని ఇలా పూజించండి.. సిరిసంపదలకు లోటు ఉండదు..

ప్రతిరోజు సూర్యభగవానుని భక్తిశ్రద్ధలతో పూజించిన వ్యక్తుల జీవితం సూర్యుని వలె ప్రకాశవంతంగా మారుతుందని, ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారని.. ప్రారంభించిన పనులు సులభంగా పూర్తవుతాయని..  ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయని విశ్వాసం. సూర్యభగవానుని ఆరాధించడం వల్ల ఎవరి జాతకంలోనైనా గ్రహ దోషాలు ఉంటే వాటిని దూరం చేసుకోవచ్చునని విశ్వాసం. పురాణాల ప్రకారం నమ్మకం ప్రకారం ఉదయాన్నే సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యన్ని సమర్పించడం ద్వారా జీవితంలో ఏర్పడిన అన్ని సమస్యలు క్రమంగా ముగుస్తాయి.

Sunday Puja Tips: జాతకంలో దోషమా సూర్యభగవానుడిని ఇలా పూజించండి.. సిరిసంపదలకు లోటు ఉండదు..
Lord Sun
Follow us
Surya Kala

|

Updated on: Jan 28, 2024 | 7:08 AM

హిందూ మతంలో సూర్య భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే సూర్యభగవానున్ని దర్శించి నమస్కారం చేయడంతో రోజు ప్రారంభమవుతుంది. సూర్యభగవానుడిని ఆరాధించడం విశేషంగా పరిగణించబడుతుంది. ప్రతిరోజు సూర్యభగవానుని భక్తిశ్రద్ధలతో పూజించిన వ్యక్తుల జీవితం సూర్యుని వలె ప్రకాశవంతంగా మారుతుందని, ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారని.. ప్రారంభించిన పనులు సులభంగా పూర్తవుతాయని..  ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయని విశ్వాసం.

సూర్యభగవానుని ఆరాధించడం వల్ల ఎవరి జాతకంలోనైనా గ్రహ దోషాలు ఉంటే వాటిని దూరం చేసుకోవచ్చునని విశ్వాసం. పురాణాల ప్రకారం నమ్మకం ప్రకారం ఉదయాన్నే సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యన్ని సమర్పించడం ద్వారా జీవితంలో ఏర్పడిన అన్ని సమస్యలు క్రమంగా ముగుస్తాయి.

శుభ్రమైన దుస్తులు ధరించడం

స్నానం చేసిన అనంతరం శుభ్రంగా ఉతికిన బట్టలు ధరించాలి. శుభ్రమైన ఉతికిన బట్టలు ధరించడం వల్ల పూజ సమయంలో సానుకూల శక్తి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పూజా ప్రదేశం

స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించిన అనంతరం పూజ చేసే ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రం చేసి.. దేవుడి పటాలను శుభ్రం చేసి బొట్టు గంధం పెట్టి అనంతరం పువ్వులతో అలంకరించండి.

పూజ ద్రవ్యాలు

సూర్యభగవానుడికి పూజ చేయడానికి ముందు సూర్య భగవానుడికి కుంకుమ తిలకం దిద్ది.. దీపం వెలిగించి ధూపం వేయండి. పూలు, పండ్లు సమర్పించి నీటితో నింపిన రాగి పాత్రను ఉంచండి. నైవేద్యంగా అన్నం లేదా పరమాన్నం సమర్పించండి.

పఠించాల్సిన మంత్రం

ఇప్పుడు సూర్య భగవానునికి నమస్కరించి, “ఓం హ్రాం హ్రీం హ్రాం సః సూర్యాయ నమః” అనే మంత్రాన్ని జపించండి. జపం చేసిన తరువాత రాగి పాత్రలోని నీటిలో అక్షతలు, పువ్వులు వేసిన నీటిని సూర్యునికి ఆర్ఘ్యంగా సమర్పించండి.

సూర్య భగవానుని పూజించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

సూర్య భగవానుని ఉదయం సమయంలో పూజిస్తారు. అందుకే సూర్యోదయ వేళలో సమర్పించే  అర్ఘ్యం, నమస్కారం పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజ తర్వాత ఇచ్చే దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.  అందువల్ల అవసరమైన వారికి అవసరమైన వస్తువులను దానం చేయడం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు