Mystery Temple: సైన్స్‌కి అందని మిస్టరీ.. ఈ శివపార్వతుల గుడి లోపల వణికించే చలి.. బయట మండే వేడి

దేశంలోని అత్యంత వేడిగా ఉండే ప్రాంతాలలో ఒరిస్సా ఒకటి. ఈ ఆలయం కుంహద పర్వతం మీద ఉంది. ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుంది. అయితే ఆలయం లోపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. బయట ఎంత వేడిగా ఉన్నా గుడి లోపల మాత్రం చలిగా ఉంటుంది. ఆలయ బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది.

Mystery Temple: సైన్స్‌కి అందని మిస్టరీ.. ఈ శివపార్వతుల గుడి లోపల వణికించే చలి.. బయట మండే వేడి
Lord Shiva Parvati Temple
Follow us
Surya Kala

|

Updated on: Jan 28, 2024 | 10:12 AM

భారత దేశంలో అనేక ఆలయాలున్నాయి. కొండ కోనల్లో, నది ఒడ్డున ఇలా అనేక ప్రాంతాల్లో దేవుళ్ల ఆలయాలున్నాయి. కొన్ని స్వయంభువుగా వెలసిన దైవాలు అయితే.. మరికొన్ని మానవ నిర్మితాలు..అయితే ఎక్కువగా ఆదిదంపతులైన శివపార్వతుల ఆలయాలు కొండల్లో ఉంటాయి. శివాలయాలు పర్వతాల మీద ఉండటం వల్ల చాలా ప్రదేశాలు విపరీతంగా చలిగా ఉంటాయి. అయితే మన భారతదేశంలోనే అంత రహస్యమైన ఆలయం ఉంది. పర్వతాల్లో చాలా వేడిగా ఉంటుంది. ఎవరైనా సరే ఆ ప్రదేశంలో ఎక్కువ సమయం ఉండలేరు.

భారతదేశంలో లయకారుడైన శివుడు, శక్తి స్వరూపిణి పార్వతి ఆలయాలు చాలా ఉన్నాయి.  శివయ్య దర్శనం కోసం భక్తులు ఎంత దూరమైనా వెళ్తారు. తమ శక్తికి మించి ప్రయాణం చేసి భగవంతుని దర్శనం చేసుకుంటారు. దేవాలయాలకు సంబంధించిన అనేక పురాణ గాధలు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి కొన్ని ఆలయాల్లోని రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. కొన్ని రహస్యాలను సైన్స్ కూడా చేధించలేదు. అలాంటి మిస్టరీ ఆలయాల్లో ఒకటి కొండమీద ఉన్న శివ పార్వతుల ఆలయం. ఈ ఆలయంలో కొన్ని క్షణాలు తీవ్రమైన వేడి ఉంటుంది.. మరికొన్ని క్షణాల్లో విపరీతమైన చలి పెడుతున్న అనుభూతి చెందుతారు.

విపరీతమైన వేడి, చలి ఉన్న ఆలయం..

మన దేశంలోని ఓ అద్భుత దేవాలయం నేటికీ రహస్యం పరిష్కరించబడలేదు. ఒరిస్సాలోని శివాలయం అద్భుతమైన ఆలయం ఉంది. మిస్టరీ ఆలయం రాష్ట్రంలోని టిట్లాగఢ్‌లో ఉంది. దేశంలోని అత్యంత వేడిగా ఉండే ప్రాంతాలలో ఒరిస్సా ఒకటి. ఈ ఆలయం కుంహద పర్వతం మీద ఉంది. ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుంది. అయితే ఆలయం లోపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. బయట ఎంత వేడిగా ఉన్నా గుడి లోపల మాత్రం చలిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆలయ బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. ఒకొక్కసారి దుప్పట్లు కప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇది దైవం మహిమా.. లేక ప్రకృతి అద్భుతమా అనేది అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు