Brihaspati Puja Tips: జాతకంలో గురు దోషం ఉందా.. ఈ 5 పరిహారాలు చేసి చూడండి.. అదృష్టం మీ సొంతం

ఎవరి జాతకంలోనైనా బృహస్పతి బలంగా ఉంటే.. వారు సంతోషంగా ఉంటారు.  మంచి విద్యను పొందుతారు. ధర్మవంతుడిగా జీవిస్తారు. జీవితంలో అడుగడుగునా అదృష్టాన్ని అందుకుంటాడు. అయితే దీనికి విరుద్ధంగా వ్యక్తి జాతకంలో గురు స్థానం బలహీనంగా ఉంటే అతని  చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. వివాహంలో సమస్యలు కలుగుతాయి. జాతకంలో బృహస్పతి గ్రహానికి సంబంధించిన దోషాల కారణంగా అతని జీవితంలో అన్నీ కష్టలే.. ఎవరి జాతకంలోనైనా బృహస్పతికి  సంబంధించిన దోషం ఉంటే.. నివారణ కోసం కోరిన కోరికలు నెరవేరడానికి కొన్ని నివారణలు చేయండి.

Brihaspati Puja Tips: జాతకంలో గురు దోషం ఉందా.. ఈ 5 పరిహారాలు చేసి చూడండి.. అదృష్టం మీ సొంతం
Brihaspati Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Jan 28, 2024 | 10:53 AM

నవ గ్రహాల్లో ఒకటి గురువు. దేవతలకు గురువుగా పరిగణిస్తారు. వ్యక్తి జాతకంలో నైనా ఆనందం, అదృష్టానికి కారకంగా పరిగణించబడతాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ధనుస్సు, మీన రాశులకు బృహస్పతి అధిపతిగా పరిగణించబడుతున్నాడు. ఎవరి జాతకంలోనైనా బృహస్పతి బలంగా ఉంటే.. వారు సంతోషంగా ఉంటారు.  మంచి విద్యను పొందుతారు. ధర్మవంతుడిగా జీవిస్తారు. జీవితంలో అడుగడుగునా అదృష్టాన్ని అందుకుంటాడు. అయితే దీనికి విరుద్ధంగా వ్యక్తి జాతకంలో గురు స్థానం బలహీనంగా ఉంటే అతని  చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. వివాహంలో సమస్యలు కలుగుతాయి. జాతకంలో బృహస్పతి గ్రహానికి సంబంధించిన దోషాల కారణంగా అతని జీవితంలో అన్నీ కష్టలే.. ఎవరి జాతకంలోనైనా బృహస్పతికి  సంబంధించిన దోషం ఉంటే.. నివారణ కోసం కోరిన కోరికలు నెరవేరడానికి కొన్ని నివారణలు చేయండి.

  1. దేవగురు బృహస్పతి ఆరాధనకు సంబంధించిన సాధారణ, ప్రభావవంతమైన నివారణ చర్యలు సనాతన సంప్రదాయంలో పేర్కొన్నారు. దేవగురు బృహస్పతి స్థానం మెరుగుగా ఉంటే జీవితంలో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి. ఐశ్వర్యాన్ని పొందడానికి పసుపు అత్యంత ప్రభావవంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది.
  2. అదృష్టం కలగాలంటే దేవగురువు బృహస్పతి ఆశీస్సులు ఎల్లవేళలా వ్యక్తి జీవితంలో ఉండాలి. కనుక రోజూ చేసే పూజలో పసుపుని ఉపయోగించాలి. పూజ చేసిన పసుపుని ప్రసాదంగా భావించి కొంచెం తీసుకుని నుదుటిపై ధరించాలి.
  3. హిందూ విశ్వాసం ప్రకారం దేవగురు బృహస్పతి అరటి చెట్టును పూజించడం వలన సంతోషిస్తాడు. అటువంటి పరిస్థితిలో ఐశ్వర్యాన్ని పొందడానికి రోజూ అరటి చెట్టుకు నీరు పెట్టిన తర్వాత తప్పనిసరిగా పూజించాలి.
  4. జాతకంలో బృహస్పతి బలహీనంగా మారి జీవితంలో ఇబ్బందులను కలిగిస్తే.. ఖచ్చితంగా కుంకుమపువ్వుకు సంబంధించిన సాధారణ సనాతన నివారణను ప్రయత్నించాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో బృహస్పతి స్థానంలో ఉండడానికి.. శుభం కలగడానికి గురువారం నాడు శ్రీ మహా విష్ణువు ఆలయానికి వెళ్లి పప్పు, కొంత డబ్బును చుట్టి పసుపు వస్త్రంలో పెట్టి సమర్పించాలి.
  7. గురువారం ఒక ఆలయంలో మతపరమైన పుస్తకాలను దానం చేయడం కూడా బృహస్పతి శుభాన్ని ఇస్తాడు.

జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల అనుగ్రహంతో  ఐశ్వర్యం పొందడానికి నవరత్నాలకు సంబంధించిన పరిహారాలు సూచించబడ్డాయి. అటువంటి పరిస్థితిలో బృహస్పతి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందాలనుకుంటే జ్యోతిష్కుని సలహాతో పుష్పరాగాన్ని బంగారు ఉంగరంలో పొందుపరిచి, పూర్తి క్రతువులతో ధరించాలి. శుభ సమయంలో.. ముఖ్యంగా గురువారం ఈ చర్యలు చేయండి. అప్పుడు ఖచ్చితంగా దాని ఫలితాలను పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు