AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic: వెల్లుల్లికి భారీగా పెరిగిన డిమాండ్.. సామాన్యులకు చుక్కలు.. అసలు కారణం మాత్రం వేరే

వేసవికాలం రాకముందే నిత్యావసరాల ధరలు మంటెక్కిస్తున్నాయి. రేట్లు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. కొద్ది నెలల కిందట కొండెక్కిన ఉల్లి, టమాటా ధరలు దిగి వచ్చాయి. అయితే, ప్రస్తుతం వెల్లుల్లి మాత్రం జనాలకు చుక్కలు చూపిస్తోంది. 

Garlic: వెల్లుల్లికి భారీగా పెరిగిన డిమాండ్.. సామాన్యులకు చుక్కలు.. అసలు కారణం మాత్రం వేరే
Garlic Prices
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Feb 08, 2024 | 2:17 PM

Share

వేసవికాలం రాకముందే నిత్యావసరాల ధరలు మంటెక్కిస్తున్నాయి. రేట్లు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. కొద్ది నెలల కిందట కొండెక్కిన ఉల్లి, టమాటా ధరలు దిగి వచ్చాయి. అయితే, ప్రస్తుతం వెల్లుల్లి మాత్రం జనాలకు చుక్కలు చూపిస్తోంది.  నిత్యం వంటల్లో అల్లం, వెల్లుల్లి తప్పనిసరి. లేదంటే ఆ కూర రుచిగా ఉండదు. కానీ, ప్రస్తుతం వెల్లుల్లి కిలో 500పై మాటే పలుకుతోంది. దీంతో వంటి గది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి నెలకుంది. రెండు వారాల్లో ధరలు రెట్టింపయ్యాయి. వాస్తవానికి గతేడాది నవంబరు మధ్య నుంచి దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరులో రిటైల్ మార్కెట్లలో వెల్లుల్లి కిలో 350 నుంచి 400 ఉండగా.. హోల్ సేల్ మార్కెట్‌లో అత్యంత నాణ్యమైన వెల్లుల్లి 250 పలికింది. కానీ, ప్రస్తుతం ఇది మరింత పెరిగి. ఏకంగా కిలో 500 కి ఎగబాకింది. ఉస్మాన్ గంజ్ లాంటి హోల్సేల్ మార్కెట్లో ధర తక్కువగా ఉంటుందని వచ్చామని, అయితే ధరలు చూసి ఖంగు తిన్నారు.

వెల్లుల్లి దిగుబడి తగ్గడంతో మార్కెట్లలోకి సరఫరా అంతంతమాత్రంగా ఉంది. డిమాండ్‌కు తగిన సప్లై లేకపోవడంతో వెల్లుల్లి ధర పెరుగుతోంది.వెల్లుల్లి సాగు ఖరీఫ్, రబీ సీజన్లలో జరుగుతుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తర బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో జూలైలో వేసిన పంట దెబ్బతిందని వ్యాపారులు తెలిపారు. భారత్‌లోని మొత్తం వెల్లుల్లి ఉత్పత్తిలో దాదాపు 40% వాటా మహారాష్ట్రదే. ప్రస్తుతం పాత స్టాక్ అరకొరగా అందుబాటులో ఉండగా.. కొత్త పంట కోసం రెండు నెలలు నిరీక్షణ తప్పదు. దీంతో అప్పటి వరకూ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హోల్ సేల్ వ్యాపారాలు అంటున్నారు.

అయితే అసలు కారణం మాత్రం వేరే ఉందని టాక్ వినబడుతుంది. ఇప్పుడు పెళ్లిళ్లు రంజాన్ మాసం ఉండడంతో ఈ డిమాండ్ బాగా పెరిగిందని.. దీనికి తోడు పంట పండించే రైతులు రెండు నెలలు ఆలస్యంగా మార్కెట్లోకి పంట వచ్చేలా ప్లాన్ చేసి డిమాండ్ క్రియేట్ చేశారని కొందరి మాట.రెండు నెలల ఆలస్యంగా మార్కెట్ లోకి వెల్లుల్లి పంట రావడం తో పంట కి మార్కెట్ లో డిమాండ్ పెరుగుతుంది..దాని ద్వారా పండించిన రైతులకు డిమండ్ వల్ల లాభాలు పెరుగుతాయని..అందుకోసమే ఇలా కృత్రిమ డిమాండ్ వచ్చింది అని కొందరి మాట. ఏది ఏమైనా వెల్లుల్లి ధరలు తగ్గాలంటే మాత్రం రెండు నెలల వరకు వెయిట్ చేయక తప్పదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..

Follow Us
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!